Thursday, May 9, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

  • 2500 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు
  • 30 ఓట్ల లెక్కింపు కేంద్రాలు
  • స్ట్రాంగ్ రూంల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ

హైదరాబాద్ : ఓ వైపు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుంటే పోలీసులు, ఎన్నికల సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో ముగినిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. నగరంలోని 9101 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ నిస్తున్నారు. డీఆర్ సీ కేంద్రాల వద్దకు బ్యాలెట్ పత్రాలను తరలించేందుకు అవసరమైన చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది.

పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు  

బూత్ ల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి డీఆర్సీల వద్ద పోలింగ్ అధికారులు సూచనలిస్తున్నారు. పోలింగ్ కేంద్రం పరిథిలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా బ్యాలెట్ పత్రాల లెక్కలను పరిశీలిస్తున్నారు. వాటి లెక్కింపు పూర్తయ్యాక బూత్ ల వారీగా విడగొట్టి  భద్రపరచాల్సిఉంటుంది. సోమవారం మధ్యాహ్నం  నుంచి బ్యాలెట్ పత్రాలను పోలింగ్ అధికారులు, సిబ్బందికి పంపిణీ చేస్తారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో సహా మైక్రో అబ్జర్వర్ల సేవలు వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒక్కో డివిజన్ ఒక్కో పోలింగ్ కేంద్రం

ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఓటరు గుర్తింపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. ప్రత్యేక యాప్ సహాయంతో ముఖకవళికల ద్వారా ఓటరును గుర్తించేలా ఫేషియల్ రికగ్నిషన్ పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచనున్నారు. మొత్తం 150 డివిజన్లలో ఒక్కో డివిజన్ లోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్నివినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

వెబ్ కాస్టింగ్ తో పర్యవేక్షణ

మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలుండగా 2500 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు.  వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అథారిటీ, రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ జరిగే తీరు, పోలింగ్ కేంద్రాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మిగతా కేంద్రాలలోనూ సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

30 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లకు గాను 30 డీఆర్ సీ కేంద్రాలను అధికారుల ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో ఎన్నికల సామాగ్రిని భద్రపరచడంతో పాటు ఓట్లనూ ఇక్కడే లెక్కిస్తారు. ఈ 30 కేంద్రాలలో వార్డుకో స్ట్రాంగ్ రూమ్, ఒక కౌంటింగ్ హాలును కేటాయించారు. ఓక్కో గదిలో 14 టేబుళ్లను రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. డిసెంబరు 1న పోలింగ్ జరగనుండగా 4 వతేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీనికోసం ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసింది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles