Thursday, May 2, 2024

దేశంలో గుణాత్మక మార్పులు రావాలి-కేసీఆర్

  • ముగిసిన సిఎం కేసీఆర్ ఒకరోజు  మహరాష్ట్ర పర్యటన
  • ఉద్ధవ్‌ ఠాక్రేతోనూ, శరద్‌పవార్‌తోనూ భేటిలు
  • హైదరాబాద్ కు రావాల్సిందిగా ఠాక్రే కూ, పవార్ కూ ఆహ్వనం

హైదరాబాద్ : సిఎం కేసీఆర్ ఒక్కరోజు మహరాష్ట్ర  పర్యటన ముగిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేనూ,  ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు..జాతీయ రాజకీయాలపై ఉద్దవ్ ఠాక్రేతో చర్చించారు. అనంతరం ఇద్దరు సిఎంలూ సంయుక్తంగా మీడియాసమావేశంలో పాల్లోన్నారు

ముంబయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే, కవిత, తదితరులు

75 ఏళ్ల స్వాతంత్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని అందుకే రావాల్సిన మార్పులపై ఉద్ధవ్‌ ఠాక్రేతోనూ, శరద్‌పవార్‌తో చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఒకటే ఏజెండాతో రావాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందనీ, ఈ వైఖరి మంచిందికాదనీ అన్నారు. తన విధానాలు  మార్చుకోకుంటే బిజెపికి ఇబ్బందులు తప్పదన్నారు కేసీఆర్. దేశంలో మరింత అభివృద్దిచేందాలంటే రాజకీయల్లో మార్పులు రావాలని చేప్పారు. తెలంగాణ, మహరాష్ట్రాలు ఇరుగుపోరుగున ఉన్నాయనీ, రెండురాష్ట్రాల మద్య వెయ్యి కిలోమీటర్ల ఉమ్మడి సరిహద్దు ఉండటం కారణంగా ఎప్పటినుంటో స్పేహపూర్వక సంబందాలు ఉన్నాయనీ అన్నారు.రెండు రాష్ట్రలు మంచి  అలోచనలతో ముందుకు వెల్లల్సిన అవసరంఉందన్నారు. ఉద్దవ్ ఠాక్రేను హైదరాబాద్ కు రావాలని ఆహ్వనించినట్లు కేసీఆర్ ప్రకటించారు.

దేశ హితం కోసం కేసీఆర్‌తో క‌లిసి న‌డుస్తాం- ఉద్ధ‌వ్ థాక‌రే

ముంబయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో శరద్ పవార, కేసీఆర్, ప్రకాష్ రాజ్, కవిత, పల్లా రాజేశ్వరరెడ్డి, తదితరులు

దేశంలో మార్పు కొసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోందన్నారు. ప్రతీకార, అధిపత్య రాజకీయాలు దేశానికి మంచిది కాదన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇక్క‌డికి రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర రెండు సోదర రాష్ట్రాలనీ, రెండు రాష్ట్రాలు క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉందనీ అన్నారు. అన్ని అంశాల‌పై మేము ఏకాభిప్రాయానికి వ‌చ్చామనీ, ఖ‌చ్చితంగా రెండు రాష్ట్రాలు ఎప్ప‌టికీ క‌లిసి ప‌ని చేస్తాయనీ ప్రకటించారు. ఈ ఐక్యతను  దేశాన్ని ఏకం చేయ‌డం కోసం ఉప‌యోగిస్తామనీ, దేశ హితం కోసం కేసీఆర్ తో క‌లిసి న‌డుస్తామనీ అన్నారు. తమతో వ‌చ్చే నేత‌ల‌తో క‌లిసి పోరాడుతాన్నారు.

కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేస్తాం-శరద్‌పవార్‌

ప్రస్తుతం దేశంలో అనేక సమస్యలు పీడిస్తున్నాయని. నిరుద్యోగం, ఇంధన ధరలు చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని  ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి  శరద్ పవార్ అన్నారు. తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని గుర్తుచేశారు. దేశ రైతుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం పోరాడిందనీ, సీఎం కేసీఆర్‌తో క‌ల‌సి ప‌నిచేస్తామ‌నీ ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles