Tuesday, April 30, 2024

పోడు భూములపై ఆదివాసీల గోడు

పబ్లిక్ హియరింగ్ లో పాల్గొన్న ఫ్రొఫెసర్ కోదండరాం, గుమ్మడి నర్సయ్య, తదితరులు

హైదరాబాద్: జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోడు భూముల సమస్యల పై పబ్లిక్ హీయరింగ్ లో బాధిత రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోడు రైతులను పట్టించుకోవలని, ఎన్నో ఏళ్లుగా దున్నుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని కోరారు . గిరిజన సంఘ నాయకులు,పార్టీల ప్రతినిధులు కూడా పోడు రైతుల పక్షాన పాల్గొని ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా తమ వాదనలు వినిపించారు. ఆదివారంనాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పౌరసమాజం ప్రతినిధులుగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి, మహేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులూ, ‘సకలం’ సంపాదకుడు కె. రామచంద్రమూర్తి పాల్గొన్నారు.

బాధితుల తరఫున కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంఎల్ఏ గుమ్మడి నర్సయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, ఏఐకెఎంఎస్ నాయకుడు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు మురళీకృష్ణ, గంపా కేశవరావు, నవారత్ శ్రీను, సరిత, మౌళిక, బాక్యా సునీత, సురేష్, గిరిజన సంఘం నాయకుడు శీలం నాయక్, తదితర బాధితులూ, వారి ప్రతినిధులూ పాల్గొన్నారు. అత్యధికంగా ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి హాజరైనారు.

శ్రీధర్, రామచంద్రమూర్తి, మధుసూధన్ రెడ్డి, వేణు, సాదిక్

తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో తాము చాలా చురుకుగా పాల్గొన్నామనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు కష్టాలు మొదలైనాయనీ బాధితులు గగ్గెోలు పెట్టారు. 2014 వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ జోలికి రాలేదనీ, ఇప్పుడు తమ భూములు తమవి కావని చెబుతున్నారనీ, కేసులు పెడుతున్నారనీ, దాడులు చేస్తున్నారనీ, జైళ్ళలో పెడుతున్నారనీ బాధితులు గోడు చెప్పుకున్నారు. హరితహారం పేరుతో తాము సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకొని మొక్కలు నాటుతున్నారని ఫిర్యాదు చేశారు. తమ భూములకూ, సర్వే నంబర్లకుూ సంబంధం లేకుండా చేశారనీ, పాసుబుక్కులను ఐటీడీఏ కార్యాలయాలలో ఉంచుతారు కానీ తమకు మాత్రం ఇవ్వరనీ, అదేమంటే కలెక్టర్ ఇవ్శద్దని చెబుతున్నారనీ గుమ్మడి నరసయ్య వివరించారు. పేద ఆదివాసీల దగ్గర భూములు లాక్కుంటున్నారనీ, పట్టాలున్న భూములు స్వాధీనం చేసుకొని పట్టాలు చెల్లవని చెబుతున్నారనీ, వారి పక్కనే శాసనసభ్యుడు శంకర్ నాయక్ పాతిక ఎకరాల భూమి రిజిస్టర్ చేయించుకున్నారనీ విమర్శించారు. ఇల్లందులో హరితహారం కోసం ఇరవై ఎకరాల భూమి అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి మందికి పట్టాలు ఇచ్చామనీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అనుమానం ఉన్నవారిని వేధిస్తున్నారని, పోలీసులూ, ఫారెస్ట్ అధికారులూ టీఆర్ఎస్ పార్టీకి చెందినవారి పక్షాన నిలుస్తున్నారనీ మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపి బలరాం నాయక్ అన్నారు. తమ పోడు పోలాలు లాక్కుంటున్నారనీ, అదేమని ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తన్నారనీ చెప్పుకొచ్చారు. జబర్దస్తీ చేస్తున్న అటవీశాఖ అధికారులతో, పోలీసులతో గట్టిగా మాట్లాడితే రైతుబంధు ఆపుచేస్తామని బెదిరిస్తున్నారని బచ్చల స్వర్ణలత ఫిర్యాదు చేసింది.

పసిపాపతో జైలులో గడిపిన ఆదివాసీ మహిళ మౌళిక

తనను పసిపాపతో సహా జైలులో ఉంచారని మౌళిక చెప్పింది. పాత ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్ కు చెందిన మౌళిక ఎంఆర్ఓ కు దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోలేదనీ, తన మూడు ఎకరాల భూమిని లాక్కొంటున్నారనీ అన్నది. చేలలో నాటిన మొక్కలను పీకేసి భీభత్సం సృష్టించారని అదే గ్రామానికి చెందిన సునీత ఫిర్యాదు చేసింది.

హరితహారం పేరిట సాగుచేసే భూములను స్వాధీనం చేసుకోవడం, పేద గిరిజనుల నోళ్ళు కొట్టడం దుర్మార్గమని మధుసూదన్ రెడ్డి అన్నారు. అటవీ శాఖ అధికారులూ, పోలీసులూ చేస్తున్నది అక్రమమని అన్నారు. చెట్లు పెరికి వేయరాదంటూ తెచ్చిన ‘వాల్టా’ చట్టం కూడా లోపభూయిష్టంగా ఉన్నదనీ, దానిని సమీక్షించాలనీ, తిరగరాయాలనీ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఇతర సామాజిక కార్యకర్తలు హాజరైనారు.

Related Articles

2 COMMENTS

  1. The pice of land cultivating by Adivasis and Tribals is their right to own it .They are not invaders they are The sons of this landslide Government and forest officials should stop their brutal treatment towards poor podu farmers .they got the right to live with respect,let them feel they have freedom to live .It is the duty of learned politicians to support their genuine rights.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles