Saturday, February 24, 2024

అంతర్వాహిని

తమస్సును తొలగించే ఉషస్సు తొలి కిరణం పుడమిని తాకింది !

తొలి భానుడి చైతన్యం తో కనులు తెరిచింది రాధ

ఆమె సంకల్పం ఈ రోజు అన్ని తరువులూ పుష్పించే విరులతో అలంకరించాలనీ

రాధ వనం లోకి వెళ్ళింది !

ప్రముఖ చిత్రకారుడు ప్రకృతి తెరపై రంగులు మేళవించి చిత్రించినట్లు ,

అప్పుడే యవ్వనం సంతరించుకున్న జవ్వనుల్లా ఉన్నాయి విరులు !

విరులన్నీ రాధ బంగారు బుట్ట లోకి చేరాయి ! చేమంతులు,బంతులు,సన్నజాజి,పొగడలు,పొన్నలు,విరజాజి లు మరెన్నో

పూలమాలగా చేసింది లీలాధరుణ్ణీ పూజించాలనీ!

రాధ పూజామందిరంలోకి వెళ్ళింది ఆశ్చర్యం అక్కడ కృష్ణుడు లేడు

ఏమయ్యాడు నా మాధవుడు ?

బృందావని విహారి మురారి ఇంతలోనే మాయమయ్యాడా ?

నే తాళగలనా? పూలమాల వాడక ముందే సుగంధ బంధాలు వీడక ముందే మురళీధరుడు కనబడడా ?

తోటంతా తిరుగుతోంది గిరిధారి ఏ దారిలో కనబడలేదు !

క్షణాలు యుగాలుగా మారుతున్నాయి

వేదనతో గుండె బరువెక్కిందీ !

కృష్ణుడి జాడలేదు! హృదిలో శ్వాస నిలబడుతుందా

నిరంజనుడు కానరాక పోతే !

రాధ కనులు మూసుకుంది. ఆమె కొక దివ్యవాణి వినిపించింది.

నేను లేని చోటు ఉందా? నన్ను పరిమితం చేసి చిన్న రూపంలో ఇమిడ్చి మురళీని ఇచ్చీ అలాగే ఉండమంటే ఏలా ?

నా అనంత తత్వాన్ని నీ అల్పజ్ఞానంతో కొలవగలవా?

కనులు తెరిచి చూడు ! పూలల్లో, నీటిలో, గాలిలో, ఆకాశంలో, ఆద్యంత రహిత విశాల విశ్వాంతరాళంలో నిండి నిబిడీకృతమై ఉన్నాను

రాధ కనులు తెరిచింది

విరులు గాలితో చేసే బృందగానంలో మురళీనాదం వినిపించింది !

ఆకాశంలో ఓంకార శబ్దం వినబడింది

సెలయేటి గలగలలో మురళీ నాదం వినబడింది

క్రుష్ణుడే జగత్ నిండి పోయాడు !

ఎందుకో రాధ మనస్సులో చింత

మురారి ఏ దారిలో

మరలా జ్ఞానమే శబ్దమై నిలిచింది !

అంతటా నిండిన నేను నీ హృదయంలో ఉండనా? “

రాధ మనస్సు అంతర్ముఖమైంది!

అద్వైతమైనది

అఖండ చైతన్యం లో ఐక్యమైంది !

(కృష్ణా ష్టమి సందర్భంగా)

Also read: విలువలు

Also read: సెన్సేషన్ నాగా

Also read: యత్ర నార్యస్తు లభతే,రమంతే తత్ర రాక్షసాః

Also read: ఫీ ని క్స్

Also read: చర్విత చర్వణం

కృష్ణుడికోసం వెతుకుతున్న రాథ
వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

2 COMMENTS

  1. Lord SriKrishna lived and passed away ,He became a spiritual icon .Till today He became a provision to poets and all creative artists to bring out their creative talent.let us know the heart of nature! And the beautiful life.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles