Tuesday, January 31, 2023

రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కెసిఆర్

దేవుణ్ణి సృష్టించింది మనిషేనని ముఖ్యమంత్రులకు తెలియదా?

ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించలేదు,  మనిషే తన ఆకారంలో దేవున్నిసృష్టించుకున్నాడు అని 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు ఎలుగెత్తి చాటారు. ఆ మాత్రం పరిజ్ఞానము మన నాయకులకు లెకపోవటం సిగ్గుచేటు. ఈ రొజు తెలంగాణ ముక్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగవిలువలను కాలరాస్తూ, యాదాద్రి గుట్టపై యాగాలు,  ముహూర్తము, మంత్రాలతో కుటుంబసమేతంగా పూజలుచేయటం రాజ్యాంగములొని లౌకికవాదాన్ని పాతర వెయ్యటమే అవుతుంది.

దసరానాడు కొత్త జాతీయ పార్టీ  ప్రకటించారు. ఎవరిని ఉద్ధరించటానికి?

Also read: పాత పునాదులను తొలగించి పటిష్టంగా నవసమాజ నిర్మాణం

అధికారికంగా ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు చెయ్యకూడదని రాజ్యంగములో వ్రాసుకున్నా, ఆ సూత్రాలను తుంగలో తొక్కి ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి చేశాడంటే, అయన కొత్తపార్టీ ఏరకమైన విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది?

కల్పితమైన పుక్కిటి పురాణాలకు, మనిషి సృష్టించుకున్న దేవుళ్ళకు ఒక ముఖ్యమంత్రి విలువయిస్తూ ఇలా చెయ్యటం మానవ విలువలకూ తిలోదకాలు ఇవ్వటమే కాగలదు.

ఒకప్రక్క శాస్త్రసాంకేతిక రంగాలతో ప్రపంచం ఎంతో ముందుకి పోతుంది. కానీ మనదేశంలొ మాత్రం మత మౌఢ్యం, మూఢ నమ్మకాలతో ముందుకి పోతుంది. ప్రధాని మొదలుకుని అధికారులవరకు అందరూ మూఢ నమ్మకాలలో కూరుకపోయినపరిస్థితి చూస్తున్నాము. రాజ్యాంగంలో శాస్త్రీయ అలోచన, ప్రశ్నించేతత్వం పెంచటం ప్రతిపౌరుని బాధ్యత అని రాసుకున్నాము.

Also read: బన్నీ ఉత్సవాలు ఆపుచేయాలి

ఆచరణలో ఎవరూ పట్టించుకోరు. పైగా ప్రశ్నిస్తే కేసులూ, అరెస్టులూ. ఎటుపోతున్నాం మనం?

ఈరకంగా ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తే దేశం ఏరకంగా ముందుకి పొతుంది?

మొన్నీమద్య తమిళనాడులో ఒకపార్లమెంటు సభ్యుడు తాను  వెళ్లిన కార్యక్రమంలో పురోహితుడు, టెంకాయలు, పూజలు ఉన్నపరిస్థితి చూసి, అక్కడి అధికారులకు క్లాస్ పీకాడు. మనది లౌకిక రాజ్యము, కనుక ఇలాంటివి ఉండకూడదు అని హెచ్చరించాడు. మననాయకులు అలాఉండటం నేర్చుకోవాలి.

మొన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరపతి వెంకన్నకు అధికారకంగా పట్టువస్త్రాలు సమర్పించాడు. అంతకుముందు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సమయంలో సముద్రానికి పట్టువస్త్రాలు సమర్పించాడు. సముద్రం కూడా బట్టలు ధరిస్తుందా అని సామాన్యుడు సైతం నవ్వుకున్నారు. మాట్లాడితే మన నాయకులు దొంగస్వాములకు సాష్టాంగపడతారు. వారిచేత ముద్దులు పెట్టించుకుంటారు. లౌకికరాజ్యంలో ఇలాచెయ్యటం రాజ్యాంగవిరుద్దము. తెలియనివారికి చెప్తే వింటారు. తెలిసి కూడా తెలియనట్లు నటించేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలి.

Also read: ఇదో వెర్రి ఆనందం

నార్నెవెంకటసుబ్బయ్య

Venkatasubbaiah
Venkatasubbaiah is a rationalist who is president of AP Rationalists Association. He had also worked as Assistant Secretary of National Rationalists Association for ten years. 72-year-old Venkatasubbaiah from Prakasham district has been very active for more than four decades exposing fake swamies and irrational things.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles