Sunday, November 10, 2024

తత్వం అర్థం కాకే యువత బలవన్మరణం

  • తత్వ బోధనలో ప్రమాదం ఉందా?
  • తత్వవేత్తల గ్రంథాలు చదవవలసిన అవసరం లేదా?

బోధపడకే సమాజంలో ఈ ఘర్షణలు చెలరేగుతున్నాయా? నేటి యువత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అతిగా తత్వం తలకెక్కించుకోవడం వల్ల సమాజం పట్ల ఏహ్య భావంతో బలవర్మణం చెందుతున్నారా? ప్రపంచ దేశాల తత్వవేత్తలు ఎన్నడో వందల ఏళ్ల క్రితం రాసిన తత్వం ఆ నాటి కాల పరిస్థితులను దాటి ఈ నాటి వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది అంటే ఆ రాతలలో అంత బలముందా? వారి బోధనలు నేటి కాల మాన పరిస్థితులకు అన్వయించుకొని యువత ప్రాణొలు కోల్పోతున్నారా? సోక్రటీసు దగ్గరి నుండి జిడ్డు కృష్ణ మూర్తి వరకు చెప్పిన బోధనలలో ప్రపంచం లో గతి తార్కిక వాదంలో మార్పు రాలేదా? ఎక్కడ ఈ లోపం?

తల్లి దండ్రులకు అందనంత ఎత్తులో పిల్లల అలోచన గమనం మారిందా? వారి మానసిక స్థితికి తత్వం కారణం  అవుతుందా? అసలు మానసిక శాస్త్ర వేత్తలకు అందనంత ఆలోచన సరళికి యువత ఎదిగిందా? మదనపల్లి దివ్య మొదలుకొని అమెరికా రాబర్ట్ వరకు ఈ తత్వ బోధన విని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? ఇవన్నీ ప్రశ్నలు! తత్వ శాస్త్రం అనగానే చాలా మంది తమకు అర్థం కాని విషయం,  అనవసరమైన విషయం అనుకుంటారు. సమాజంలో తర్కం ఉపయోగిస్తూనే తర్కం తెలియదు అనుకుంటారు. తర్కం వల్ల సమాజానికి దూరం అవుతామనే భ్రమలో ఉంటారు.  ఎక్కువ తర్కం చదవడం వల్ల అతి తెలివితో సమాజంలో పిచ్చి వాడిగా ముద్ర వేస్తారనే అపోహ వల్ల తర్కం తెలిసిన కూడా దాన్ని అంటకుండా చేసే తల్లి దండ్రుల వల్ల సమాజంలో యువత అయోమయావస్థలో  ఉంది.  కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో వచ్చే పోస్టింగులం తెలుసుకుందామనే జిజ్ఞాస వల్ల పిల్లలు ఇప్పుడు అన్ని ఇజాలను అవపోసన పడుతున్నారు. తర్కస్థితిని  తెలుసుకున్న  పిల్లలు ఇంకాస్త ముందుకు వెళ్లి హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, మార్కిజం, అంబెడ్కరిజం, , హ్యూమనిజం,  ప్రాగ్మాటిజం,  దళితవాదం, బహుజనవాదం, ఇలా అన్ని ఇజాలు కళ్ళ ముందు కనబడుతుంటే ఏ ఇజం  సాపేక్ష సిద్ధాంతం భోదిస్తుందో తెలియక బుర్ర వెడెక్కి, ధూమపానానికి బానిసలు అవుతున్నారు. ఇక కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం దేవుడు లేడు. ఒక పదార్థం ఉంటుంది.  అదే నిరపేక్ష సత్యం అని వారు ఉద్భోదిస్తారు. ఈ విశాల భావాలు అర్థం చేసుకునే స్వభావం  పెద్దల నుండి పిల్లలకు అందడం లేదు! కార్యకరణ సిద్ధాంతాలు చెప్పే వారు కరువవడం.

చదివిన జ్ఞానం ఎక్కువవడం వల్ల ట్రాన్స్ లోకి వెళ్లి పిల్లలు ఉరివేసుకుంటున్నారు. చదివిన చదువుకు సమాజం నడుస్తున్న తీరుకు పొంతన లేక ఏది నిజం? ఏది అబద్దం? సమొధానం తెలియక యువత నానా యాతన పడుతున్నారు!

చతుర్విధ పురుషార్థాలు భారతీయ సమాజాన్ని శాసిస్తున్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగు హిందూమతంలో భాగమై పోయాయి! ధర్మం అంటే మత లేక సామాజిక నియమకాలకు కట్టుబడి ఉండడడం, అర్థం అంటే ధన సంపాదన, కీర్జి వ్యామోహలు, కామం అంటే శరీర, లౌకిక సుఖాలు, మోక్షం అంటే పునర్జన్మ రాహిత్యం, సంసార సుఖం త్యజించడం, భార్యా భర్తలు కలసి ఉంటూనే లౌకిక భోగాలకు దూరంగా ఉండి మోక్షం కోసం జపాతపాదులు చేసుకోవాలి.

ఇలా మైన్డ్ సెట్ లోపించిన యువత కొద్దిగా పాశ్చాత్య ధోరణులు వైపు మరలినా ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగి సాహిత్యం వంట బట్టించుకున్న వారు తప్పుదారి పడుతున్నారనే శంక తల్లి దండ్రుల్లో కలుగుతోంది. పిల్లలు కూడా విషయ పరిజ్ఞానం కోసం తల్లి దండ్రులను అడగకుండా, ఒక వేళ అడిగినా తమకు తెలిసినంత తమ పేరెంట్స్ కు తెలియదనే అహంకారం వల్ల పిల్లలు తాము అనుకున్న రీతిలో ఆర్డర్ లేకుండా పుస్తకాలు,  సాహిత్యం చదవడం వల్ల అతి తెలివి తో అపశృతులు కొని తెచ్చుకొంటున్నారు. తత్వ వేత్తలు ఏమి చెప్పినా ప్రశ్నల వర్షంలో జవాబులు వెతుక్కోమంటారు. ఆ ప్రశ్న కూడా తర్కంగా ఉంటుంది. ఆ తర్కం ఎవరితో ఉండాలి?

ఎవరి తర్కం వల్ల విషయ పరిజ్ఞానం వస్తుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న! చదువు –  సమస్య రెండు అనంతాలే! వీటిని తర్క దృష్టితో ఆలోచించే వారెంత మంది? రొటీన్ లైఫ్ లో చాలా మంది ప్రతి సమస్యను దాట వేసే దృష్టి తో చూస్తూ అన్ని సమస్యలనూ  కాలమే పరిష్కరిస్తుంది అంటారు. ఇది మెట్టపురాణం. కాలం సమస్యలను పెంచుతుంది. దాని వల్ల మానవ సంబంధాల్లో గ్యాప్ పెరుగుతుంది. చాలా మంది పుండు ఒక దగ్గర ఉంటే మందు మరో దగ్గర రాయదం వల్ల పుండు మానదు కదా రాచపుండుగా మారుతుంది. మానవ జీవితం అంతా సమస్యల వలయం! కోటికో నూటికో ఒకరు సంస్కర్త పుడతాడు. అతను మేధావిగా మారడానికి వంద కష్టాలు పడతాడు! సమాజం పోకడలను వడబోసి తనకు తోచిన విధంగా రాయడం వాటిని కొంత మంది అన్వయించుకోవడం. ఆ అన్వయం నుండి సరికొత్త జ్ఞానం రావడం అలా పుస్తకాలు జీవిత సత్యాలు అవుతాయి! ఆ సత్యాన్ని సరియైన దారిలో నడిపే వారు సంఘ సంస్కర్త అవుతారు. ఇక ఓషో బోధనలు, జగ్గీ బోధనలు, జిడ్డు కృష్ణమూర్తి బోదనలు అన్ని ఈ నాటి యువతకు పాఠ్యాంశాలు అయ్యాయి. వేమన, సుమతీ శతక కారుడు  రాసిన పద్యాల్లో కూడా జీవిత సత్యాలు ఉన్నా, మోడ్రన్ ప్రపంచం ఆంతా ఆంగ్ల బోధనలో అరటి పండు ఒలిచినట్టు చెబుతున్నా వారి బోధనలకు ఆకర్షితులవుతున్నారు! ముప్పై ఏళ్ల వరకు పెళ్లీ పెటాకులు లేక చదువు ఉద్యోగం తో టైమ్ పాస్ ఫోన్ యువత జీవిత గమనాన్ని మారుస్తుంది. ఒక ఆసక్తికరమైన పోస్టింగ్ దొరికితే చాలు దాన్ని అధ్యయనం చేయడానికి నిరంతర వెతుకులాట వల్ల సాహిత్య, సౌందర్య దొంతరలో పిల్లలు ఎంచుకునే మార్గాలు కొన్ని మంచివి అయితే కొన్ని చెడ్డవి అవుతున్నాయి!, ప్రతీ విషయం తెలుసుకోవాల్సిన అవసరం మేర తెలుసుకోకుండా డీప్ గా వెళ్ళడం వల్ల సాహిత్య ఆర్డర్ దెబ్బతినడం, సరియైన గైడెన్స్ పొందక పోవడం వల్ల తల్లి దండ్రులకు పుత్ర శోకం మిగులుతుంది! రజనీష్ బోధనకు మన్మోహన్ సింగ్, వినోద్ ఖన్నా ఆకర్షితులు అయ్యారంటే వారి వయసు వేరు.

వాళ్ళు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. జీవిత చరమాంకంలో వారు సేద దీరడానికి రజనీష్  బోధనలు వాళ్ల తప్పోప్పులకు మజిలీ కావచ్చు కానీ   ముక్కు పచ్చలారని విద్యార్థులు తమ చిన్న బుర్రలో పెద్ద సాహిత్య భాండగారాన్ని నింపడం వల్ల నరాలు చిట్లి పోతున్నాయి! తత్వ శాస్త్ర అధ్యయనం ఒక సముద్రం. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీసు, రూసో,ఇలా ప్రశ్యాత్య తత్వ సిద్ధాంతాలు భారతీయ సాంస్కృతికి  అన్వయించుకోవడం వల్ల కూడా అపశృతులు వస్తున్నాయా? మనదేశ తత్వ వేత్తలు శంకరాచార్యులు, గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు, రామానుజా చార్యులు, మధ్వాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభు,రాజా రామ మోహన రాయ్, దయానంద సరస్వతి, రమణ మహర్షు, రామకృష్ణ పరమహంస, స్వాను వివేకానంద, అరవిందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మగాంధీ, రాయ్, జిడ్డు కృష్ణమూర్తి ఇలా ఎవరికి తోచిన తత్వాన్ని వారు బోధించారు. అందులో ఎవరేమి చెప్పినా సమాజ హితవు, సంస్కారం ఉంటుంది. దానికి విరుద్ధంగా కొత్త పోకడలు పోయే వారికి ఈ తత్వం రుచించదు! అన్ని కలగలిపి చదివితే పొంతన కుదరదు. ఇవన్నీ విడమరిచి చెప్పే వారు లేరు. ఇలా యువత కన్ఫ్యూజింగ్  స్టేజి లో కొట్టు మిట్టాడుతూ ఏది నిజం? ఏది అబద్దం తెలుసుకోలేక మిథ్యా వాదాన్ని అందుకోలేక సతమతమవుతూ మ్యాడ్ లుగా ముద్ర పడుతున్నారు

ఇదీ చదవండి: లాక్ డౌన్ అవస్థలు…చులకన అవుతున్న పురుష పుంగవులు

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles