Monday, December 9, 2024

నో …ఓపెన్ సెసేం

ఇంటికి వెళ్లడం అంటే

అడవికి వెళ్లడమే

 ప్రవేశం దుర్లభం

 మన కారులో కాకుండా

 మరో కారులో వెళ్తే

 మార్గం నిండా ఒడిదుడుకులే

 అపరిచితుడుని  చూసినట్టుగా –

గట్టిగా మాట్లాడితే

ఫోన్ చేస్తానంటాడు

సెక్యూరిటీ గార్డు

 తన ఇంట్లోకి పోవడానికి తనకే  లైసెన్స్ కావాలి

గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ల నగరంలో

గేటు తెరుచుకోవడం

ఓపెన్ సెసేం” కాదు

 ఇక్కడ తంతెలు ఎక్కాల్సిన పని లేదు

 లిఫ్టులు సుకుమారం గా తీసుకొని వెళతాయి

 పక్కన ఎవరో

వెనక ఎవరో

ముందు ఎవరో

ఏమీ తెలియదు

అపరిచితుల మధ్య జీవనం

 చెప్పుకోవడానికి ఇది అతని ఇల్లే

అన్ని కొనుక్కోవడమే

కిరాయి లాంటి భృతి  కట్టాల్సిందే!

అక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయి

అడడానికి స్థలం

మొక్కడానికి గుడి

ఆడటానికి  టెన్నిస్ కోర్టు

క్లబ్ హౌస్

సూపర్ మార్కెట్

మందుల షాపు

బ్రాందీ షాపు

హోటల్

ఎన్నని చెప్పను

అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది

ఒక్క మనస్సు లేనట్టు అనిపిస్తుంది.

ఇక్కడ

అన్నీ అపరిచిత ముఖాలే

ఈ అపరిచిత ప్రపంచంలో

పరిచిత మొఖం ఒక్క అతని భార్యేనేమో

Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles