Sunday, June 26, 2022

మా కాలేజ్

ఛీ ఛీ ఏం కాలేజ్ ఇది

ఇక్కడ మనుషులు కుక్కల్లా తోకలాడిస్తారు

నక్కల్లా గోతులు తవ్వుతారు

పులుల్లా గాండ్రిస్తారు

సింహాల్లా గర్జిస్తారు

కాని మనుషుల్లా కలిసి ఉండలేరు.

ఛీ ఛీ ఏం కాలేజ్ ఇది

ఇక్కడ నిజాల కంటే రూమర్లకు బలమెక్కువ

సత్యాలకంటే కులాలకు శక్తెక్కువ

జ్ఞానం కంటే అజ్ఞానికి స్థానమెక్కువ

దూరదృష్టి, పరిశీలనా శక్తి, అనురక్తి

కనుపించవు మచ్చుకు కూడా

అందుకే అంటున్నాను మళ్ళీ

ఛీ ఛీ ఏం కాలేజ్ ఇది.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles