Sunday, June 20, 2021

ప్రళయం

వినీలాకాశాము వ్రక్కలై

వీధిలో తచ్చాడుతోంది.

శూన్యం లో మట్టిమరకలు.

వికృత మకరాలు మరిచికా జలధిలో

విహారం చేస్తున్నాయి.

రంభను రాతిపై తోసి అనుభవించిన రావణుడు

వికటాట్టహాసం చేస్తున్నాడు.

కురుసభలో కురులు విరబోసికొని

 మగ జాతి వినాశనానికి

శపధం చేస్తున్న  ద్రౌపది.

ఆపిల్ కోసం పరుగెడుతున్న ఆడమ్

వెర్రి నవ్వులు ఎడెన్ తోటలో ప్రతిధ్వనిస్తున్నాయి.

భయం తోఁ పరుగెడుతున్న నిర్భయ, 

దిశ మరిచి  దుర్దశ వైపుగా అడుగిడుతున్న

డాక్టర్ దిశ…

చంపు,  నరుకు అంటూ

భయంతో ముందుకూ వెనుకకు పరుగెడుతున్న

ప్రజలు … అవి ఆర్తనాదాలో, ఆత్ర రావాలో

ప్రకోపమో,   ప్రతీకారేచ్చొ

వారికే తెలియని విచిత్ర  స్థితి.

కళ్ల ముందు కనుపించీ కనిపించని

ఆసురీ రూపాల కరాళ నృత్యం.

స్పష్టాస్పష్టం గా  నిజ స్వప్నావస్థల

 మిశ్రమ ప్రతిబింబాలు.

కళ్ళు తెరవడానికి జంకు ,

కళ్లుమూస్తే ఏమవుతుందో నని భయం.

ప్రళయ కాల సన్నద్ధత తోఁ

ప్రకృతి రెక్కీ చేస్తున్నట్లు

ఒక్క సారిగా  ముసురుకొస్తూన్న

 వైపరీత్యాల,  దుశ్శకునాల పరంపర…

ఏమవుతోంది ఈ  ప్రపంచానికి?

కాలం వద్ద సమాధానం ఉందా?

మరి మన వద్ద…?

Also read: నీకు దగ్గరగా

Also read: జ్ఞాపకాలు

Also read: నిశ్శబ్ద గీతిక

Also read: కర్మ ఫలం

MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles