Tuesday, March 28, 2023

తిమింగలము — సీతాకోకచిలుక

                         ————————

(‘ THE WHALE AND THE BUTTERFLY’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్

         40. సంచారి తత్త్వాలు

         ————————————————-

ఒకప్పుడు, ఒకానొక సాయంత్రం యువతీ యువకులిద్దరు ఒక గుర్రపు బగ్గీలో కలిసి  కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. వారు అంతకు ముందు కలిసారు.

ఆ యువకుడు ఒక రచయిత. అతనామె పక్కన కూర్చొని — కొన్ని తను అల్లిన కథలతోనూ, కొన్ని బయటి కథలతోనూ — ఆమెను రంజింప చేయాలని అనుకున్నాడు.

అతను మాట్లాడుతూ ఉండగానే ఆ యువతి నిద్రలోకి జారుకుంది. ఇంతలో అకస్మాత్తుగా ఆ గుర్రపు బగ్గీ కుదుపుకి గురయ్యింది. ఆమె మేలుకొని ఇలా అంది.” జోనా మరియు తిమింగలం కథ వివరణ మీరు బాగా చెప్పారు. “

       ఆ రచయిత ఇలా అన్నాడు ” కానీ, మేడం! నేను సీతాకోకచిలుకా, తెల్ల గులాబీల  నా స్వంత కథ గురించి, అవి ఒక దాని పట్ల ఇంకొకటి ఎలా ప్రవర్తించాయి– అనే దాని గురించి మీకు చెబుతున్నాను!”

Also read: మార్గము

Also read: రాజదండము

Also read: అన్వేషణ

Also read: నేరమూ, శిక్షా

Also read: చెెవిటి భార్య

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles