Friday, March 29, 2024

హిజాబ్

మంగారి రాజేందర్

గాయమైందని మేము వచ్చాం

మా గాయానికి

ఎలాంటి మలాం రాయకుండా

అది అలాగే కొంత కాలం కొనసాగాలని మీరన్నారు

మేం కోరింది ఒకటి

మీరు ఇచ్చింది మరొకటి

ఇది బాధాకరంగా వుందని

పై వాళ్ళ దగ్గరికి వెళ్తే

మీ దగ్గరే తేల్చుకోమన్నారు

ఎన్నో సందేహాలు

ఈ దేశంలో వున్న

వ్యవస్థలు

మూడా ..?

రెండా…?

తెలియడం లేదు

ఇదేమి

దుస్థితో అర్ధం కాని

పరిస్థితి

ఈ దేశానిది

ఈ ముఖం బట్ట

మాకన్నా

మీకే ఎక్కువ

అవసరమనిపిస్తుంది.

Also read: కొన్ని రాతలు

Also read: కనబడుట లేదు

Also read: నొప్పి మందు

Also read: ఒకప్పుడు …

Also read: నో …ఓపెన్ సెసేం

Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles