Friday, March 29, 2024

కేసీఆర్ పుట్టినరోజంటూ ఆర్భాటపు కార్యక్రమం

  • ట్విట్టర్ లో విజయశాంతి మండిపాటు
  • కోటి వృక్షార్చన పేరుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
  • మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల పేరుతో హడావుడి చేయడాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్  పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారని విజయశాంతి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని విమర్శించారు.  గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారు. వాళ్ళు పాపం గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా భరించాలని గగ్గోలు పెట్టినా పట్టించున్న పాపాన పోలేదని విజయశాంతి అన్నారు. వేసవి కాలంలో నీళ్ళు లేక మొక్కలు చచ్చిపోతే తమకు షోకాజులు పంపుతారేమోనని ఆవేదన చెందారు. ఇవేవీ సర్కారుకు పట్టలేదు.

ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు:

సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు. గతంలో వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులెత్తేశారు. తర్వాత ఉద్యానవన శాఖ అధికారి ఒకరితో సీఎం గారి ఫౌంహౌస్ నివాసంలో కోట్లాది రూపాయల విలువైన పనులు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సమయానికి జీతాలందక ఆర్టీసీ, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని విజయశాంతి విమర్శించారు.  బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నా కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు.  ఈ అవినీతి, అసమర్థ, అబద్ధాల, విఫల ప్రభుత్వాన్ని నదులకు మొక్కులు, నాటి గాలికి వదిలేస్తున్న మొక్కలు కాపాడతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నారు. తెలంగాణ పాలకుల ఈ లెక్కలేనితనానికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నరని విజయశాంతి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Also Read: పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles