Friday, April 19, 2024

ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా

  • రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించిన రావత్
  • కథ నడిపించిన అసంతృప్త ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ అధిష్ఠానం

ఉత్తరాఖండ్ లో రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా చేశారు.  ఈమేరకు రాష్ట్ర గవర్నర్ బేబి మౌర్యని కలిసి రాజీనామా సమర్పించారు. త్రివేంద్ర సింగ్ రావత్ పై సొంత పార్టీ నేతలే కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వ మార్పుని కోరుతూ గత కొన్ని రోజులుగా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి పావులు కదిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగి ఇటీవల ఇద్దరు సీనియర్‌ నేతలను ఉత్తరాఖండ్ పంపింది. రాష్ట్ర కోర్‌ సభ్యులతో వారు సమావేశమయ్యారు. అనంతరం ఆ నివేదికను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించారు. సోమవారం త్రివేంద్ర సింగ్ రావత్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానాన్ని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు బలంగా వినిపించాయి.

Also Read: పెట్రో ధరలపై భగ్గుమన్న రాజ్యసభ

రావత్ రాజీనామా:

సీఎం పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ పెద్దలు రావత్‌కు సూచించడంతో ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తన పదవికి రాజీనామా చేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవికి రావత్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి రాజీనామాతో మద్దతుదారులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. రావత్ కు మద్దతుగా నినాదాలు చేశారు.

కొత్త సీఎంపై ఊహాగానాలు!

రావత్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రి నియామకంపై పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే ఎమ్మెల్యే థన్ సింగ్ రావత్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తదుపరి సీఎంను ఎంపిక చేసుందుకు పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం (మార్చి 10) ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సీధర్ భగత్ వెల్లడించారు. 48 ఏళ్ల ధన్ సింగ్ రావత్ శ్రీనగర్ గఢ్వాల్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Also Read: మిథున్ చక్రవర్తి వల్ల బీజేపీకి ఏమి ప్రయోజనం?

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles