Friday, April 19, 2024

ఆదివారం ముంబయ్ లో ఠాకరేతో కేసీఆర్ భేటీ

మీ పోరాటం సాగించండి, మీతో మేముంటాం: కేసీఆర్ తో ఠాకరే

దేశాన్ని విభజనశక్తుల నుంచి కాపాడుకోవడానికి గొప్పగా పోరాడుతున్నారు

ఈ నెల 20 తేదీ న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిధ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం కెసీఆర్ చేస్తున్న  పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.  బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సీఎం కేసిఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును  పలికారు.

ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ, ” కేసిఆర్ జీ, మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…”

అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. “మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భం లో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం,” అని సీఎం కెసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles