Thursday, April 25, 2024

భక్తులకు వైకుంఠద్వార దర్శనం : టీటీడీ నిర్ణయం

  • అంజనాద్రి ప్రాంతం అభివృద్ధి
  • శ్రీశైలం గోపురానికి బంగారు తాపడం
  • వసతి గదుల్లో గీజర్లు
  • మహిళా విశ్వవిద్యాలయంలో హాస్టల్ భవనాలు

తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయించింది. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది

కోవిడ్ నిభందనలు సడలిస్తే, పండుగ తరువాత సర్వదర్శనం పెంచాలనీ, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభించాలని కూడా నిర్ణయించారు.

11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్స నిర్వహించారనీ, చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తామనీ, పాలకమండలి సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారనీ టీటీడీ తెలిపింది.

500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులకు కేటాయించాలనీ, హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేయాలనీ, నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మించాలనీ, భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చాలనీ, హిందు ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కూడా టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను  పునర్ నిర్మించాలనీ, ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేయాలనీ, రూ. 2.6 కోట్ల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేయాలనీ, శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయాలనీ పాలకమండలి తీర్మానించింది.

తాళ్లపత్ర గ్రంధాలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేయాలనీ, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పించాలనీ, భక్తులకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందించాలనీ, కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాలనీ, 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేయాలనీ, 10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం చేపట్టాలనీ,

12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మించాలనీ టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలియజేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles