Friday, December 2, 2022

సరస్వతీ మాత బిడ్డల ఘన విజయం ఇదీ!!

 నిబద్దత, ఆత్మవిశ్వాసం, ఆలోచన తత్వం నాకు అభిమానులను పెంచింది. 160 మంది ఈ కార్యక్రమానికి వస్థారని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాను. తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘాల జిల్లా నాయకత్వాలు కేడర్ ను కదిలించి దారులు అన్నీ ప్రజ్ఞాపూర్ వైపు మరలించడం, రెండెకరాల పంక్షన్ హల్ ప్రాంగణం కార్లతో కిక్కిరిసిపోయి తారు రోడ్డు పై కూడా కార్లు ఆపడం చూస్తే నాకు కడుపు నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుండి సంఘ అభిమానం ఇంతగా వెల్లువెత్తడం నిజంగా ఆనందం కాక మరేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది సన్మాన్యులు వారి బంధు జనం మహా అయితే 100 మంది గెస్టులు వస్తారని భావించాను. కానీ ఒక్కరా? ఇద్దరా?? అనుకున్న దానికి మూడింతలు ఈ కార్యక్రమానికి రావడం వారిని సన్మానించినప్పుడు వారి బంధు జనం కళ్ళలో కనబడ్డ ఆనందం కన్నా నేను ఎక్కువే చవిచూశాను. తెలంగాణాలోని అన్నీ జిల్లాలకు మన భావజాలం వెళ్లడం నా విజయం కాదు.

Also Read: కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?

సమస్త కరణం నియోగ బ్రాహ్మణ సంఘం విజయం!! ప్రతి ఒక్కరికి వినపూర్వక వందనాలు. ఈ గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలిచిన 13 మంది బ్రాహ్మణ సంఘాల నాయకులు,  ఈడబ్లుఎస్ కోసం పోరాడి సాధించిన మిత్రులకు సగర్వాంగా సన్మానించాం. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన తెచ్చినా మరొకరిని మరచిపోతానని భయపడుతున్న మాట వాస్తవం!! చివరిగా మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తరఫున చైర్మెన్, కమిషనర్ కౌన్సిలర్లు కూడా హాజరయి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వారిని స్టేజి మీద సత్కరించటం కూడా మా ప్రథమ కర్తవ్యంగా భావించాం! కేవలం ఎనిమిది మంది ఈ కార్యక్రమ ఖర్చు భుజస్కంధాలపై వేసుకోవడం ఒక ఎత్తు! వచ్చిన జనానికి వండి పెట్టడానికి వెనుకాడని నాగేశ్వరరావు వంట బృందానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎంత మాత్రం విసుకోక్కుండా మంచి భోజనం అందించారు. ఇక చివర్లో డ్యాన్స్ ప్రోగ్రాం భవ్య మేకప్ అయి వచ్చి గెస్ట్ ల రాకతో ఆమెకు సమయం ఇవ్వలేని స్థితి. వాళ్ళ అమ్మ గారు బాగా నిరాశ చెంది ఇక  మా అమ్మాయి ప్రోగ్రాం ఉండదేమో అని నిరాశ చెందుతున్న వేళ భోజనం చేసిన ప్రేక్షకులను కూడా సీట్లకు కట్టి పడేసేలా అద్భుత నాట్య ప్రదర్శన ఇచ్చి ఆనందంగా వెళ్లిన అమ్మాయి ఆనందం ఎంతగా ఉందో, అంతకు రెట్టింపు ఆనందం నాకు కలిగింది! మళ్ళీ చెబుతున్న తెలంగాణ 33 జిల్లాల నుండి తరలివచ్చి నన్ను ఆశీర్వదించిన అందరి విజయం ఇది.

Also Read: కేటీఆర్ సి.ఎం ఆశలు సజీవమే!

అందరికి కృతజ్ఞతలు!  ఈ సమావేశానికి వెల్లు వెత్తిన మహిళా చైతన్యం ప్రజ్ఞాపూర్ కార్య క్రమానికి విచ్చేసిన రాష్ట్ర వ్యాప్త TKNBS బాధ్యులకు వందనాలు! నేను సంఘం పెట్టినప్పుడు నలుగురం ఈ రోజు ఈ జన ప్రవాహం నా పై మరింత బాధ్యత పెంచింది! ప్రతి సమావేశానికి మహిళల హాజరు అంతంత మాత్రమే. ఈ సారి వారి ఆదరణ, ఆప్యాయత చూసి నాకు కళ్ళు చెమర్చాయి! ఇక సంఘం గృహిణుల ఇంటి ముందుకు చేరింది. సరస్వతీ మాత అనుగ్రహం లభ్యమైందన్న సంతృప్తి మిగిలింది! రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన సంఘం అభిమానులు, కుటుంబ సమేతంగా రావడం నా ఆనందానికి అవధులు లేవు! నాకు గత వారం రోజులుగా తీరిక లేని పని ఒత్తిడి వల్ల జిల్లాల వారందరికీ పేరు పేరున ఫోన్ చేసే అవకాశం కోల్పోయాను. నా శ్రమను గుర్తించి మేమున్నాం మీరు ముందుకు సాగండి అని ఆశీర్వదించి మన కార్యక్రమ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ఈ విజయం నా కుటుంబ సభ్యులది కూడా!! వారం రోజుల పాటు వారికి టైం ఇవ్వలేని స్థితి నా సహాధర్మచారిణి శైలజ, నా కుమారుడు స్వేచ్ఛ నిశ్చయ్, మా అత్తగారు అరుణ దేవి గారికి మా ఇంటి పెద్ద మాజీ సర్పంచ్ రాం మోహన్ రావు గారు, స్వయంగా అందరికి వడ్డన చేసిన మా వదిన సుజాత గారు, మా  చెల్లెళ్లు, కల్యాణ తిలకం ఇన్ చార్జి శ్రీలత గారికి, ఒక్కరేమిటీ నా వెంట అహర్నిశలు శ్రమించిన  శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు, శ్రీ వడితల ప్రభాకర రావు గారు, ఇలా నా శ్రమలో భాగమయ్యారు. మా ఇంటి మహాలక్ష్మి నా కూతురు ప్రత్యుష ప్రియదర్శినిసాగర్ కు పీహెచ్ డీ ప్రోగ్రాం ఆన్ లైన్ పరీక్ష లో బిజీ కావడం తో కూడా సుదూర తీరంలో ఉండి కూడా నాకు కొండంత అండగా నిలిచింది. పేరు పేరున జిల్లా కేడర్ ను కదిలించిన మన సంఘ బాధ్యులకు , వివిధ బ్రాహ్మణ సంఘం నాయకులకు, ఆత్మీయ మిత్రులకు, జర్నలిస్ట్ మిత్రులకు   కృతజ్ఞత పూర్వక వందనాలు.

Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles