Thursday, December 8, 2022

మార్గము

(‘ THE PATH’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్

                        39. సంచారి తత్త్వాలు

                        ——————-

కొండల మధ్యన ఒక స్త్రీ తన కుమారునితో నివసిస్తుండేది. అతడు ఆమెకు మొదటి సంతానం మరియు ఏకైక సంతానం.

వైద్యుడు పక్కన ఉండగానే ఆ పిల్లడు జ్వరంతో చనిపోతాడు. తల్లి దుఃఖంతో దిక్కుతోచని దైపోయింది. ఆమె వైద్యుని ఎదుట దుఃఖించి అతనిని ఇట్లా వేడుకుంది. “దయ చేసి చెప్పండి. నా కొడుకు బాధని తొలగించిందీ, అతని పాటని నిశ్శబ్దం చేసిందీ — ఏమిటి?”

వైద్యుడు ఇలా అన్నాడు ” అది జ్వరం అమ్మా!”

తల్లి ” జ్వరమంటే ఏమిటి?”

వైద్యుడు ” నేను వివరించలేను. అది ఒక అనంతంగా చిన్నదైన వస్తువు. అది శరీరంలో ప్రవేశిస్తుంది. మన కళ్ళతో మనం దాన్ని చూడలేము,” అన్నాడు. అప్పుడా వైద్యుడు వెళ్లి పోయాడు. ఆమె ” అనంతమైన చిన్నది. మన కళ్ళతో చూడలేము,”  అని పదే పదే అనుకోసాగింది.

ఆ సాయంత్రం మత గురువు ఆమెను ఓదార్చడానికి వచ్చాడు. ఆమె బాగా ఏడ్చింది. ఏడుస్తూనే ” నేను నా కొడుకుని ఎందుకు పోగొట్టుకున్నాను? అతడు – నేను జన్మఇచ్చిన ఏకైక సంతానం.’’

ఆ మత గురువు” అమ్మాయ్! అది దైవేచ్ఛ,’’ అని సమాధానం చెప్పాడు.

ఆ యువతి “దైవమంటే ఏమిటి? ఎక్కడుంటాడు? నేనా దైవాన్ని చూసి నా గుండెల్లో కన్నీళ్లు ఆయన ముందు కారుస్తాను. నా హృదయంలో నెత్తురు ఆయన పాదాల ముందు పోస్తాను. ఆ దైవమెక్కడుంటాడో చెప్పండి?” అంది.

 ఆ పూజారి ఇలా చెప్పాడు. “దైవం అనంత, విశాల స్వరూపం. మానవ దృష్టికి కనిపించడు.”

ఆ యువతి ఏడుస్తూ ఇలా అంది. “ఒక అనంత విశాల స్వరూపంయొక్క ఇచ్చతో ఒక అనంత స్వల్ప పదార్థం నా కుమారుని చంపిందన్న మాట! ఐతే మనమేమిటి?  చెప్పండి. మనమేమిటి?”

అదే సమయంలో ఆ యువతి తల్లి, శవంపై కప్పే గుడ్డతో ఆ గదిలోకి వచ్చి తన కూతురు — పూజారీ మాట్లాడుకునే మాటలు వింది. అప్పుడామె ఆ గుడ్డను పక్కన పెట్టి, కూతురి చేతిని తన చేతిలోకి తీసుకొని ఇలా చెప్పింది. “అమ్మాయీ! మనకు మనమే అతి చిన్న పదార్థమూ మరియు అనంత విశాల స్వరూపమూనూ! ఇంకా ఆ రెంటికి మధ్య — మార్గం కూడా మనమే!”

Also read: రాజదండము

Also read: అన్వేషణ

Also read: నేరమూ, శిక్షా

Also read: చెెవిటి భార్య

Also read: ఒక దేవుడు మరియు చాలా మంది దేవుళ్ళు

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles