Friday, March 29, 2024

ఙాన జ్యోతి

అమావాస్య

అంతటా అంధకారం

లోపల బయట చిక్కటి చీకటి

క్కర్మేంద్రియాల ఆయాసం

జ్నానేంద్రియాల అలసత్వం

మనో బుద్ధుల మందమతం

మకరు గొఢ్ఢుతో పోరాటం

మగటిమి మరుగున పడడం

ఆదిపరాశక్తి ఆవేశ విజృంభణం

అనంత శక్తిచే సురారి భంజనం

నరకాసుర విముక్తి ఆనిమేష విజయం

మానవజాతికి మార్గదర్శనం

లోని అసుర శక్తి వినాశం

జీవన్ముక్తికి రాజమార్గం

చీకటి నుండి వెలుగుకు ప్రయాణం

దీప ప్రజ్వలనం ప్రతీకాత్మకం

లోకా సమస్తం ఙానానందమయం.

Also read: ఆనంద మార్గం

Also read: నిందాకృష్ణ

Also read: అంధాంద్ర

Also read: స్వామి

Also read: దేవుడు

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles