Thursday, April 18, 2024

కోట్ల కణాల కుప్ప మానవ శరీరం

భగవద్గీత 17

Epigenitics అని ఒక శాస్త్రం ఉన్నది. జీన్స్‌ ఎలా సచేతనం (activate) అవుతాయి, ఎలా అచేతనం (deactivate) అవుతాయి అని ఈ శాస్త్రం చెపుతుంది. Dr Bruce H Lipton అని ఒక శాస్త్రవేత్త ఆ శాస్త్రంలో విశేష పరిశోధన చేసి, కొన్ని మన నమ్మకాలను పటాపంచలు చేసే సత్యాలు ఆవిష్కరించాడు. తోటి శాస్త్రవేత్తలు నిర్ఘాంతపోయారు ఆ ఆవిష్కరణలు చూసి.

Also read: కర్తను తానే అంటాడు భగవంతుడు

(You can buy this book “Biology of belief” Dr Bruce H Lipton – Amazon లో దొరుకుతుంది)

మన శరీరంలోని కణాలు ఏవిధంగా విషయాలు (information) గ్రహిస్తాయి అనేదే ఆ విషయం. జీవి మనుగడను జీన్స్‌, DNA కాదట శాసించేది. DNA ని బయటనుంచి వచ్చే కొన్ని సంకేతాలు (signals), మన ఆలోచనల నుండి వెలువడే శక్తివంతమైన సంకేతాలు అదుపు చేస్తాయట.

మనిషి ఆలోచనలకు అంత శక్తి ఉన్నదట. (యద్భావం తద్భవతి) అంటారు కదా! అంటే మన భావం (ఆలోచన) ఏదయితే అదే జరిగి తీరుతుంది!

ప్రాణి తల్లి గర్భంలో మొదట ఒక కణంగానే ఉంటుంది. తల్లి అండము, తండ్రి శుక్రకణము కలిసి జైగోట్‌ గా మారుతుంది! అప్పుడు కొంత సమయానికి దానినుండి ఒక ఏంటెన్నా బయల్పడి బయట వున్న శక్తికి అనుసంధానమయ్యి శక్తిని గ్రహించడం మొదలు పెడుతుంది.

Also read: ధర్మం గాడితప్పినప్పుడు పరమాత్ముడి జోక్యం

ఆ శక్తితో, ఈ కణము తరువాత కొన్ని కోటానుకోట్ల కణాలుగా విభజింపబడుతుంది. ఇన్ని కోట్ల కణాలు ఒక క్రమ పద్ధతిలో పేర్చబడిన కుప్పే ఈ శరీరం.  అలాగ మనుషులంతా ఒకే రకమయిన కోటానుకోట్ల కణాల కుప్పలు అన్నమాట…

అప్పుడు అన్నీ కణాలేకదా! అన్నీ ఒక చోటినుంచే కదా శక్తిని స్వీకరించేది! అప్పుడు వాటికి భేదం ఎక్కడ? అన్ని ప్రాణులలో తానేకదా! అదే శక్తికదా!…

`సర్వభూతస్తమాత్మానమ్‌!` అని పరమాత్మ అనటం దీని గురించేకదా! అంటే పరమాత్మ తనను తాను ఎన్నిరకాలుగా సృజించుకున్నాడో కదా!

ఈ విధమయిన భావం మన మనస్సులో నిలకడగా ఉన్నప్పుడు… రాగమేమిటి? భయమేమిటి? కోపమేమిటి? అసలు అవి అన్నీ లయమయి పోయినట్లే కదా!

మన మనస్సులో పరమాత్మ భావం తిష్ఠ వేసుకుని మనం పరమాత్మలో లీనమయినట్లే కదా!

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః

జ్ఞానరూప తపస్సుచే నన్ను ధ్యానించేవారు రాగము, భయము, క్రోధము విడిచినవారయి నా స్వరూపాన్ని  పొందెదరు!

Also read: ‘అమిద్గల’ మాయాజాలం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles