Friday, April 19, 2024

బీజేపీ ఓటమే లక్ష్యం

  • రైతు సంఘాల నేతల ప్రతిన
  • బెంగాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి గట్టిగా బుద్ధి చెప్పాలని రైతు సంఘాల నేతలు పట్టుదలగా ఉన్నారు. బిజెపిని ఓడించడమే లక్ష్యంగా బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి లలో బీజేపీ ని ఓడించి తీరుతామని కిసాన్ సంఘటన్ మోర్చా యూనియన్ నాయకులు శపథం చేస్తున్నారు. 109  రోజులు గా ఢిల్లీ సరిహద్దులైన తిక్రి, సింగూ, ఘాజిపూర్ లలో ఆందోళన చేస్తున్న అన్నదాతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి తప్పని సరిగా రైతుల దెబ్బను రుచి చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. బెంగాల్ లోని నందిగ్రామ్ సహా 294 నియోజకవర్గములలో పర్యటించి అందరికి బీజేపీ ని ఓడించాలని సందేశాన్ని ఒక లేఖ ద్వారా పంపిస్తామమని కిసాన్ పంచాయతీ లు ర్యాలీ లు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని రైతు యూనియన్ నాయకులు యోగేంద్ర యాదవ్, రాకేష్ తికాయత్ లు ప్రకటించారు.

కార్పొరేట్ వ్యవసాయంతో ఇబ్బందులు:

బీజేపీ ని గెలిపించిన వారికి ఓడించే సత్తా కూడా ఉందని నిరూపిస్తామని రైతు సంఘాల నేతలు అంటున్నారు. న్యాయ భాష, నైతిక విలువల దేశంలోని అన్న దాతల భాష బీజేపీ కి అర్థం కావడం లేదని అర్థం చేసుకోలేనంతగా అహం. నియంతృత్వ పోకడలకు బీజేపీ అలవాటుపడిందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీకి ఓటమి అంటే ఏంటో చూపిస్తామని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రాజకీయంగా బీజేపీ ని దెబ్బకొట్టడం ద్వారా దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయే ముఖ్యంగా పీఎం మోదీ కి తెలవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు చెబుతున్నారు.

Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం

బెంగాల్లో పెరుగుతున్న బీజేపీ వ్యతిరేకత:

How Mamata Banerjee is countering the BJP's NRC play in Bengal - The Hindu  BusinessLine

వొట్కా చోట్.. అంటే ఓటు ఇచ్చే గాయాన్ని  బీజేపీ కి తప్పని సరిగా తగిలే విధంగా చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి గత 169 రోజులుగా అమృతసర్ లో రైల్ రోకో చేస్తూ రైలు పట్టాల పైనే పడుకుని ఆందోళన చేస్తున్న రైతులు ఆందోళన ముగించడంతో గురువారం రైళ్లు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో బీజేపీ కి వ్యతిరేకంగా రైతుల, ఉద్యోగుల కుటుంబాలు ఒక్కటవుతున్నారు. కోల్ ఇండియా లో పని చేస్తున్న సుమారు మూడున్నర కోట్ల మంది ఉద్యోగులు అధికారులు కార్మికులు బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటికరణ, కోల్ ఇండియా లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం పశ్చిమ బెంగాల్ లో చాలా ప్రభావం పడింది. నందిగ్రామ్ నియోజకవర్గం లో ని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఏకపక్షంగా ముఖ్యమంత్రి మమతా వైపే ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కూడా తృణమూల్ కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నా ఇక్కడ బీజేపీ. కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఓట్లు చీల్చే పరిస్థితి నెలకొంది. దీదీ పై దాడి లేదా ప్రమాద వశాత్తు గాయపడి ఆసుపత్రిలో ఉన్న సంఘటన తో ఆమెకు నందిగ్రామ్ సహా రాష్ట్రంలో అంతా సానుభూతి పెరిగింది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో దీదీ పై మాటల దాడి, పీఎం మోదీ సైతం మాట్లాడుతున్న తీరు, వాడుతున్న భాష అవహేళన లతో బీజేపీ పై ఉన్న గౌరవం సన్నగిల్లుతున్నట్లు తెలుస్తోంది. మిథున్ చక్రవర్తి బిజెపి లో చేరిన సందర్భంగా పీఎం మోదీ సభలో అనంతరం మీడియా తో తాను కోబ్రా లాంటి వాడినని మాట్లాడిన తీరు రాష్ట్రమంతా వైరల్ అయి బిజెపి నేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. వీల్ చైర్లో తాను ప్రచారం చేస్తానని దీదీ మమతా బెనర్జీ ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగినట్లు తెలుస్తోంది.

Also Read: బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి

బీజేపీకి గడ్డుపరిస్థితులు:

మొత్తంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ కాలం నుంచి  చేస్తున్న ఉద్యమం విదేశాల్లోను మద్దతు కూడ గట్టుకోవడం మాత్రమే కాకుండా అక్కడి చట్ట సభల్లో నూ చర్చకు రావడం లాంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెంగాల్ లో రైతు సంఘాల నేతల పర్యటన ముగియగానే కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి లలో కిసాన్ పంచాయతీ లు ర్యాలీలు నిర్వహించాలని బిజెపి ని ఓడించాలని పిలుపు నిచ్చేందుకు రైతు సంఘాల నేతలు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు బిజెపి కి వ్యతిరేకంగా దేశంలో మెజారిటీ గా సంసిద్ధం అవుతున్న తీరు బిజెపి శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామం. మరోవైపు నందిగ్రామ్ లో దాడి అనంతరం ఆసుపత్లో చికిత్స పొందుతున్న మమతా బెనర్జీ డిశ్చార్జి అయ్యారు. ఆమె వీల్ చైర్ పైనే ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Also Read: రాజకీయాల్లోనూ అసమానతలు

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles