Sunday, September 15, 2024

మానవత్వాన్ని అన్వేషిస్తున్న మానవుడు మరణించిన రోజు!

ఒక మతోన్మాది చేతుల్లో మహాత్మాగాంధీ నేలకొరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు గతించి పోయినవి. మానవజాతి తరతరాలు భక్తితో జ్ఞాపకం పెట్టుకునే శాంతిదూత,  త్యాగి, కర్మయోగి, దీనజన బాంధవుడు, ప్రపంచ మానవుడు ఆయన.

నా పన్నెండవ తరగతిలో బడిలో చదివిన వ్యాసం, గాంధీజీ మృతి చెందినప్పుడు పెర్ల్ బక్ రచించినది, జ్ఞాపకం వస్తున్నది:

“Gandhi is dead. His mortal remains are spread over the rivers and soil of India. The Indomitable frame, the fearless spirit, the long years, the high purpose, all are ended so easily. It was the pulling of a trigger, the shot of a gun and all that remains is silence and a handful of ashes.”

जानें- उस दिन की पूरी कहानी, जब महात्मा गांधी को मारी गई थी गोली - know  last day of mahatma gandhi on his death anniversary tedu - AajTak
చివరిసారిగా ప్రార్థనకు వెడుతూ గాంధీ…

తుపాకీ గుండు తగిలినప్పుడు సైతం రామనామమే జపిస్తూ  నేలకొరిగిన వాడు గాంధీజీ. ఆయన హఠాన్మృతిచే దుఃఖితుడైన మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఇట్లా అన్నాడు:

హింద్ గయా

ముసల్మాన్

ఇన్సాన్ కి

ఔలాద్ మె

ఇన్సాన్

గయా”

“ఈ రోజొక హిందువు మరణించలేదు. ఒక ముసల్మాన్ మరణించలేదు. మానవత్వాన్ని వెదకుతూ అసలైన ఒక మానవుడు మరణించినాడు!”

మార్టిన్ లూథర్ కింగ్ (జూ)  జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడి గాంధీజీ వలెనే తుపాకి దెబ్బకు అసువులు బాసిన వాడు. గాంధీజీ ఆశయాలచే ప్రేరేపితుడై, నల్ల జాతీయుల విముక్తి పోరాటంలో తన జీవిత సర్వస్వం ధారపోసిన వాడు. గాంధీజీ గూర్చి ఆయన ఇట్లా అన్నాడు:

“Like most people, I had heard of Gandhi, but had never studied him seriously. As I read him, I became deeply fascinated by his campaigns of non-violent resistance. The whole concept of satyagraha was profoundly significant to me.”

“Gandhi was probably the first person in history to lift the love ethic of Jesus above mere interaction between individuals to a powerful and effective social force on a large scale. The intellectual and moral satisfaction that I failed to gain from the utilitarianism of Bentham and Mill, the revolutionary methods of Marx and Lenin, the social.contract theory of Hobbes, the back to nature optimism of Rousseau, and the superman philosophy of Nietzsche, I found in the non-violent resistance philosophy of Gandhi.”

“If humanity is to progress, Gandhi is inescapable. He lived, thought and acted, inspired by his vision of humanity evolving toward a world of peace and harmony. We may ignore him at our own risk”.

“Gandhiji resisted evil with as much vigour and power as the violent resister, but he resisted with love instead of hate. True pacifism is not unrealistic submission to evil power. It is rather a courageous confrontation of evil by the power of love”.

కరువుతో, ఆకలితో, దుర్బర దారిద్ర్యంతో చచ్చి పోయే దీన భారతీయులకు సాయం చేయడానికి బదులు, రాళ్ళు సేకరించి ప్రార్థనా మందిరాలను నిర్మించే క్రైస్తవ మిషనరీలను ఉద్దేశిస్తూ, స్వామి వివేకానంద, నూట ముప్ఫై యేళ్ళ క్రిందట, అమెరికా గడ్డపై ఇట్లా అన్నాడు:

You erect churches all through India, but the crying need in the East is not religion. They have religion enough. But it is bread that the suffering millions of burning India cry out for, with parched throats. They ask us for bread but we give them stones. It is an insult to starving people to offer them religion. It is an insult to a starving man to teach him a metaphysics. I came here to seek aid for my impoverished people, and fully realized how difficult it was to get help for heathens in a Christian land.”

నూట ముప్పై యేళ్ళ క్రిందట స్వామీజీ, దుఃఖంతో,  క్రైస్తవ ఫాదరీలతో పలికిన పలుకులు నేటి హైందవ సమాజానికి అక్షరాలా వర్తిస్తాయి.

అదే నూట ముప్పై యేళ్ళ క్రిందట చికాగో నగరంలోని సర్వమత సమ్మేళనంలో  వివేకానంద ఎలుగెత్తి చాటిన సనాతన భారతీయ సాంస్కృతిక మూలాలను పరికించండి:

“I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. I am proud to belong to a nation that has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth”.

“I will quote to you Brothren! a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood and which is being repeated by millions of human beings:  As different streams having their sources in different places, all mingle their waters in the sea, so O Lord! the different paths which men take through different tendencies, various though they appear, straight or crooked, all lead unto thee”.

ఏకం సత్ విప్ర బహుదా వదన్తి” అని ఋగ్వేదం చాటుతున్నది. జాతివాదము, మతవాదము, యీ ఋగ్వేద ప్రార్థనకు వ్యతిరేకమైనవి. మానవ హృదయమే దేవాలయంగా నమ్మిన వాడు టాల్ స్టాయ్ (The kingdom of God is within thee!). ఇదే సూత్రాన్ని విశ్వసించిన వాడు మహాత్మాగాంధీ కూడా.

తన వ్యాసం చివర్లో పెర్ల్ బక్ ఇట్లా అన్నది.  “India! Be worthy of Gandhi!”.

Gandhi Assassinated - HISTORY
అమరుడైన మహాత్ముడు

మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వైష్ణవగీతం చదవండి:

తన కంఠమున దాచి హాలాహలం

తల నుండి కురిపించు గంగాజలం

మనిషి శివుడవడమే గాంధీ మతం

బాపు ననుసరిస్తే చాలు మనమందరం”

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles