Sunday, November 10, 2024

కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

• ఐదుగురు పందెం రాయుళ్ల అరెస్ట్
• 15 వేల నగదు స్వాధీనం

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ , ఎస్ ఐ ఎస్.లచ్చన్న, హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంచిర్యాల జిల్లా హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , ముల్కల్ల గ్రామ శివారులో కొంత మంది కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారంతో దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

1 .పెట్టం అశోక్ S/o శంకర్, వయసు: 32 సంవత్సరాలు, కులం:పెరిక, వృత్తి: బిజినెస్, R /o బజార్ ఏరియా , బెల్లంపల్లి.
2.కల్లూరి మల్లేష్ S/o మల్లయ్య, వయసు: 38 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: బిజినెస్, R /o హనుమాన్ బస్తి , బెల్లంపల్లి.

  1. పైతర్ల శంకర్ S/o రాజన్న, వయసు: 36 సంవత్సరాలు, కులం: చాకలి, వృత్తి: కూలి, R /o శ్రీనివాస కాలనీ, ఏ సి సి, మంచిర్యాల్ .
  2. శివరాత్రి ప్రసాద్ S/o చిన్న వెంకటి, వయసు: 33 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: బిజినెస్, R /o రడగంబాల బస్తి , బెల్లంపల్లి.
    5 మధరవేణి శరత్ కుమార్ S/o లింగయ్య, వయసు: 29 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: డ్రైవర్, R /o హనుమాన్ బస్తి , బెల్లంపల్లి.
    దాడుల్లో 15 వేల రూపాయల నగదు 5 సెల్ ఫోన్లు, ఒక తవెరా వాహనాన్ని (AP 01Y 6938) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం హాజిపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నకిలీ పత్తి విత్తనాలు , కలప అక్రమ రవాణా, చిట్ ఫండ్స్ , ఫైనాన్స్, పేకాట, కోడి పందాలు, అలాగే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలలో నిషేదిత గుట్కా, ఇసుక అక్రమ రవాణా ,కల్తీ ఆహార పదార్థాలు, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పందెంరాయుళ్లను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ కిరణ్, ఎస్సై లచ్చన్న, హాజీపూర్ ఎస్ ఐ చంద్ర శేఖర్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, వెంకటేష్, ఓంకార్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, రాకేష్ లను సీపి అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles