Wednesday, December 6, 2023

ఐటీ సోదాలపై వైరల్ అవుతున్న తాప్సీ ట్వీట్లు

  • మొదటి సారి స్పందించిన తాప్సీ పన్ను
  • కేంద్ర మంత్రిని సాయం కోరిన తాప్సీ ప్రియుడు మథియాస్

తన నివాసంలో ఐటీ అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ ట్విటర్‌ వేదికగా తొలిసారి స్పందించారు. గడిచిన మూడు రోజులుగా తన నివాసంలో జరిగిన ఐటీ అధికారుల సోదాలపై  ఏం జరిగిందో చెప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం అధికారులు తనిఖీలు చేశారని అయితే తనకు పారిస్ లో ఇల్లే లేదని తాప్సీ ట్వీట్ చేశారు. 5 కోట్ల రూపాయలు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు అడిగారని కానీ తాను అంత పెద్ద మొత్తాన్ని ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగాయన్న సంగతి తనకు జ్ఞాపకం లేదని తాప్సీ పన్ను ట్విటర్‌లో తెలిపారు.

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి తాప్సీ నివాసాలలో ఐటీసోదాలు జరిగాయి. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2013లో కూడా ఐటీ సోదాలు జరిగాయని అప్పుడు స్పందిచని వారు ఇప్పుడు విషయాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు, ఐటీ సోదాలపై నటి తాప్సీ ట్విటర్ లో వ్యగ్యంగా స్పందించారు. ప్రధానంగా మూడు విషయాలపై గత మూడు రోజులుగా తీవ్ర శోధన జరిగింది.

తాప్సీ ట్వీట్:

1) నాకు పారిస్‌లో బంగ్లా ఉందని ఆరోపించారు కదా.. ఆ ఇంటి తాళాలు కోసం శోధించాను. ఎందుకంటే వేసవి సమీపిస్తోంది కదా.

 2) అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఆశతో 5 కోట్ల రూపాయలు తీసుకున్న రసీదు కోసం వెతికాను. ఎందుకంటే ఆ డబ్బును నేను గతంలో తిరస్కరించాను.

 3) అలాగే గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు 2013లో నాపై జరిగిన ఐటీ దాడుల జ్ఞాపకాన్ని కూడా శోధించానని తాప్సీ వెటకారంగా ట్వీట్లు చేశారు.

Also Read: నందిగ్రామ్ నుంచి మమత పోటీ

కేంద్ర మంత్రి సాయం కోరిన తాప్సీ ప్రియుడు:

తాప్సీ నివాసంలో ఐటీ దాడులను ఉద్దేశిస్తూ ఆమె ప్రియుడు మథియాస్ బో ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి పంపారు. ఏదో తెలియని గందరగోళానికి గురవుతున్నాను. మొట్టమొదటి సారి భారత్ కు చెందిన గొప్ప క్రీడాకారులకు కోచ్ గా వ్యవహరిస్తున్నాననే సంతోషంలో ఉండగానే తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని తెలిసి కాస్త ఇబ్బందికి లోనయ్యాను. ఈ దాడుల వల్ల ఆమె కుటుంబం ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. కిరణ్ రిజుజు సర్ ..దయచేసి ఏదైనా చేయండి అంటూ మథియాస్ ట్వీట్ చేశారు.

అదిరిపోయే రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి :

మథియాస్ ట్వీట్ కు స్పందించిన కిరణ్ రిజిజు చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు, ఈ విషయం చట్టం పరిధిలోనిది. మన వృత్తిపరమైన బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వహిద్దామంటూ సమాధానమిచ్చారు.

Also Read: తేయాకు తోటల్లో ప్రియాంక గాంధీ హల్ చల్

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles