Thursday, April 25, 2024

మానవహక్కులను హరిస్తున్న తాలిబాన్: సాలే

అమ్రుల్లా సాలే, అర్యానా సయీద్

తాలిబాన్ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారనీ, ఉత్తర బాగ్లాన్ రాష్ట్రంలోని అండరాబ్ లోయలో ప్రజలకు ఆహారం లభించకుండా కట్టడి చేస్తున్నారనీ అఫ్ఘాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ఆరోపించారు. అండరాబ్ ప్రాంతంలో నాయకత్వంలోని ప్రతిఘటన శక్తులకూ, తాలిబాన్ కీ మధ్య కాల్పులు జరిగినట్టు వార్తలు అందుతున్న నేపథ్యంలో సాలే ఈ ప్రకటన చేశారు. ముజాహిదీన్ నాయకుడిగా ప్రసిద్దిగాంచిన దివంగత అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ పాంజ్ షీర్ లో ప్రతిఘటన శక్తులకు నాయకత్వం వహిస్తున్నారు.

‘‘అండరాబ్ లోయలోకి ఆహారాన్ని, ఇంధనాన్నీ తీసుకురావడానికి తాలిబాన్ అనుమతించడం లేదు. అక్కడ మానవీయ పరిస్థితి భయంకరంగా ఉంది. వేలాది మంది మహిళలూ, పిల్లలూ కొండలవైపు పరుగులు తీశారు. రెండు రోజులుగా పిల్లల్నీ, పెద్దల్నీ అపహరించి తాలిబాన్ తమకు

కవచాలుగా ఆత్మరక్షణకు వారిని ఉపయోగించుకుంటున్నారు. ఇంటింటా మనుషుల కోసం వెతుకుతున్నారు,’’ అని సాలే ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు.

అఫ్ఘానిస్తాన్ కు అత్యవసరంగా తీసుకురావలసిన వస్తువులను తీసుకురాలేకపోతున్నామని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మందులూ, అత్యవసర వస్తువులూ సరఫరా చేసేందుకు వీలుగా ‘‘మానవీయమైన వంతెన’’ (హుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్) ను ఏర్పాటు చేయాలని వారు సూచిస్తున్నారు. సుమారు 500 టన్నుల ఔషధాలు అఫ్ఘానిస్తాన్ కు పంపించవలసినవి పంపలేకపోతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రాంతీయ సంచాలకుడు రిచర్డ్ బ్రెన్నన్ చెప్పారు. కాబూల్, కుండుజ్, హెల్మండ్ రాష్ట్రాలలో వారం రోజులుగా మందులు జయప్రదంగా సరఫరా చేశారు. అయితే మందులు అడుగంటిపోతున్నాయనీ, వాటిని అఫ్ఘానిస్తాన్ లోని పలు ప్రాంతాలకు పంపించవలసి ఉన్నదని ఆయన గొడవపెడుతున్నాడు.

మందులూ, ఆహారం సరఫరా చేయడమే కాకుండా వృద్దులనూ, బలహీనులనూ, వ్యాధిగ్రస్థులనూ అఫ్ఘానిస్తాన్ నుంచి బయటికి తరలించవలసిన అవసరం ఉన్నదనీ, ఆ పని సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదనీ ఆయన అన్నారు.

భారత్ అఫ్ఘాన్లకు ఆత్మీయదేశం: గాయని అర్యానా సయీద్

అఫ్ఘానిస్తాన్ పాప్ సింగర్ అర్యానా సయీద్ తాలిబాన్ బారిన పడకుండా అఫ్ఘానిస్తాన్ నుంచి తప్పించుకొని వచ్చారు. తాలిబాన్ అనే  ఉగ్రవాదుల ముఠాను శక్తిమంతులుగా చేసింది పాకిస్తాన్ అనీ, ఇండియా అఫ్ఘాన్లకు మంచి మిత్రదేశమనీ ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ నేను పాకిస్తాన్ నే నిందిస్తాను. తాలిబాన్ ను బలోపేతం చేయడం వెనుక పాకిస్తాన్ ఉన్నదని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి.  వీడియోలలో అనేక దృశ్యాలు చూశాం. మా ప్రభుత్వం తాలిబాన్ ను పట్టుకున్న ప్రతిసారీ వారిలో పాకిస్తాన్ పౌరులు ఉండటాన్ని గమనించాం. పాకిస్తాన్ ఇప్పటికైనా అఫ్ఘానిస్తాన్ రాజకీయాలలోజోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది,’’అని అర్యానా సయీద్ అన్నారు. తాలిబాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ లో శిక్షణ ఇస్తున్నారని ఆమె అన్నారు.

అందరూ కూర్చొని, సమూలంగా చర్చించి, అఫ్ఘానిస్తాన్ లో శాంతి నెలకొల్పడానికి ఏమి చేయాలో ఆలోచించవలసిందిగా అంతర్జాతీయ సమాజానికి ఆమె విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ పైన ఒత్తిడి పెట్టవచ్చుననీ, పాకిస్తాన్  కారణంగా అఫ్ఘానిస్తాన్ లో ఇన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయనీ ఆమె అన్నారు. ఇండియా అఫ్ఘానిస్తాన్ కు మంచి మిత్రదేశమని ఆమె అభివర్ణించారు. ఆఫ్ఘాన్ ప్రజల తరఫున ఇండియాకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మాకు ఇరుగుపొరుగున ఉన్న దేశాలలో భారత్ ఒక్కటే మా శ్రేయోభిలాషి అని అనుకుంటున్నాం అని కూడా ఆమె అన్నారు. 2015లో ఆమె స్టేడియంలో పాటలు పాడారు. తాలిబాన్ నిబంధనల ప్రకారం హిజబ్ ధరించకుండా ఒక మహిళ బయటికి రారాదు. స్టేడియంలో ప్రజలను అలరిస్తూ పాటలు పాడకూడదు. ఆ విధంగా ఆమె తాలిబాన్ ఆగ్రహానికి గురైనారు. అందుకే సాధ్యమైనంత తొందరలో అఫ్ఘాన్ నుంచి నిష్క్రమించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles