Wednesday, December 8, 2021
Home Tags Flemingo

Tag: flemingo

ఫ్లెమింగో-9

తరలి వచ్చిన బంజార పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగూట్లో ఆరాబోస్తాయి ప్రణయ కలాప లాటీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి తరుణ హృదయకేళీ విలాసాలు యామిని ఏకాంతంలో కోరిక లూదుతాయి ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు...

ఫ్లెమింగో-8

అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి గూటి గూటికో రాగవల్లరి ప్రతిచెట్టూ రంగుల దొంతర నేల పట్టంతా పక్షుల జాతర కుహు కుహులు కిత కితలు కువకువలు కిలకిలలు ఎన్ని రాగ వసంతాల సంగమాలో ఎన్నెన్ని సంబరాల దొంతరలో వలయాక్షుల ఉల్లాసగానాలతో వాతావరణం ఉత్పుల్ల మౌతుంది విహాయస విద్యుత్ రహదారిలో రంగుల...

ఫ్లెమింగో-7

  ఆంక్షల్లేని ఆకాశం కింద అతిథి పక్షులు విశ్వసౌభ్రాతృత్వ సందేశ వాహకులు ప్రేమ ప్రబంధాలు మోసుకొచ్చిన మహాకవులు ప్రణయ రహస్యాలెరిగిన మన్మధులు సంతానవితతీ సంవేదనతో పరివార పటలి వీడివచ్చిన ప్రేమికులు విత్తంతైనా విశాల హృదయాలు వీళ్ళవి వొత్తి లేని దీపాల్లాంటివి వీళ్ళ కన్నులు వెలుగు పంచడమే...

ఫ్లెమింగో – 6

కాలం రెక్కలపై కదిలిన ఫెలికాన్లు గాలి కారులో దూసుకొచ్చిన ఫ్లెమింగోలు పతంగులై ఎగిరొచ్చిన ఎర్రకాళ్ళ కొంగలు రెపరెపలాడుతూ ఎగిరిన కొంకణాయి కెరటాల తెరచాపల పైన నల్ల కొంగలు దేశదేశాల ప్రేమ రాయబారులందరూ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నట్టు నేలపట్టు ప్రకృతంతా రంగుల ప్రేమ సందేశాలు పక్షి...

ఫ్లెమింగో-5

వలస ఒక అనాది యాత్ర వలస ఒక పురాతన జాతర జీవన నేపథ్యం రంగు మారినపుడు వలస ఒక ఆయుధం మేఘం కన్నెర్ర చేసి చినుకు కరువు చేస్తే అన్నదాత కడుపు చేత పట్టుకుని ఊరు వలసవుతుంది రైతు బతుకు కూలీ అవుతుంది వలస ఒక జాతిని...

ఫ్లెమింగో-4

అనంతమైన స్వేచ్చకు రెక్కలు మొలిస్తే పక్షి ఒక బెదురును ఒక అదురును కళ్ళనిండా నింపుకుని సరిహద్దు సైనికుడిలా అనుక్షణం అప్రమత్తమై అన్వేషణే చూపై చూసేది పక్షి రెక్కల కొసలకి తోకల మొనలకి అందమైన కలనేత రంగులు అద్దుకునేది పక్షి ఒక జెట్ వేగాన్ని ఒక వాయు సోయగాన్ని వలేసి పట్టుకునేది పక్షి కడుపు కాలిన...

ఫ్లెమింగో-3

ప్రతి చలనం ప్రయాణమే ప్రతి హననం ప్రయాణమే ప్రతి జననం ప్రయాణమే ప్రయాణమే వలస పక్షుల జిగీష సంతానమే అనురాగ సాగర ప్రయాస కెరటాల కాళ్ళతో కడలి పరుగెత్తినట్టు తెరలు తెరలుగా గాలి ప్రవహించినట్టు ఊపిరూపిరులుగా  జీవితం సాగిపోయినట్టు వార్తలు వార్తలుగా ప్రపంచం తిరుగుతున్నట్టు రెక్కలు రెక్కలుగా ఎగిరొస్తాయి పక్షులు దాంపత్య జీవన పరీప్సలో...

ఫ్లెమింగో-2

ప్రయాణం ఒక చలన లక్షణం ప్రవాహం ఒక చైతన్య ఆవరణం పువ్వు ప్రయాణిస్తుంది పరాగమై పువ్వు నుంచి పువ్వు వరకు అనురాగమై పక్షి ప్రయాణిస్తుంది సరాగమై తీరం నుంచి తీరం వరకు పరంపరాగమై సంతానకాంక్ష మాతృధర్మం సంతాన కాంక్షే ఆత్మ వ్యాప్తి మర్మం సృష్టి కార్యం ఒక్క మనిషికేనా వర్తిస్తుంది సృష్టి న్యాయం సమిష్టిలో సమానంగానే వర్ధిల్లుతుంది ఎన్ని చినుకులైతే ఒక...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
18,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles