Tuesday, April 23, 2024

కార్గో విమానాల్లో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వాక్సిన్ సరఫరా

  • ప్రత్యేక విమానాల్లో కొవిషీల్డ్ వాక్సిన్లు
  • జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న కరోనా వాక్సినేషన్

కరోనావైరస్ వ్యాప్తితో తల్లడిల్లిన భారత్ తో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో కరోనాను అరికట్టేందుకు వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. వాక్సినేషన్ లో భాగంగా మంగళవారం (జనవరి 12) తెల్లవారుజామున తొలి అంకం ప్రారంభమయింది. కరోనాకు విరుగుడుగా కొవిషీల్డ్ ను తయారుచేసిన సీరం ఇన్ స్టిట్యూట్ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది.

ఇది చదవండి: దేశ ప్రజలకు త్వరలో కరోనా వ్యాక్సిన్

పూణె నుంచి బయలుదేరిన కంటెయినర్లు:

పూణె తయారీ కేంద్రం నుంచి వాక్సిన్ డోసుల్ని మూడు ప్రత్యేకంగా రూపొందించిన కంటెయినర్లలో పూణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుండి దేశంలోని పలు ప్రాంతాలకు వాక్సిన్లను చేర్చనున్నారు. రవాణాను సులభతరం చేసేందుకు వాహనాల్లో జీపీఎస్ సౌకర్యం కల్పించారు. మొత్తం 478 బాక్సులలో వాక్సిన్ లను భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు సుమారు 32 కిలోలు ఉంటుందని సమాచారం. మొత్తం 56.5 లక్షల వాక్సిన డోసులను దేశంలోని నిర్దేశించిన ప్రాంతాలకు తరలించనున్నారు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో విమానాలలో వాక్సిన్లను తరలించనున్నారు.

తొలి విడత వాక్సినేషన్ లో భాగంగా పూణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్ కతా, చెన్నై బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, లక్నో, గౌహతి ఛండీగడ్ భువనేశ్వర్ కు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య విమానాలు, 2 కార్గో విమానాలను వినియోగిస్తున్నారు. తొలి కార్గో విమానం హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్ కు వెళ్లాయి. రెండోది కోల్ కతా, గౌహతి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ముంబయికి రోడ్డు మార్గం ద్వారా టీకా డోసులను సరఫరా చేస్తున్నారు.

ఇది చదవండి: కొవాగ్జిన్ కోసం క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు

తొలివిడతలో 3 కోట్లమందికి వాక్సిన్:

కరోనా వాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది . తొలివిడతలో 3 కోట్ల మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. అనంతరం 50 ఏళ్లు పైబడినివారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్ల లోపు వారికి టీకా వేస్తారు. తొలివిడతలో మూడు కోట్లమంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుఅయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తన టీకాలను కూడా 12 రాష్ట్రాలకు  సరఫరా చేయనుంది.

ఇది చదవండి: ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles