Sunday, September 15, 2024

జస్టిస్ రమణను అడ్డుకోవడం అసాధ్యం

  • ఉండవల్లి విశ్లేషణ
  • కేసుల సత్వర విచారణపై అభినందిస్తూ సీజేఐకి లేఖ
  • పారదర్శకత చాలా ప్రదానం

ఏపీ రాజకీయాలలో విలక్షణ నేతగా పేరొందిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖరాశారు. ఇదేదో ఏపీ సిఎం జగన్ ప్రధాన న్యాయమూర్తికి కొందరు న్యాయమూర్తులపై  రాసిన  లేఖకు అనుబంధం కాదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు పై వున్న కేసులను సత్వర విచారణ  ఆదేశాలివ్వడం పట్ల అభినందించడం ఆ లే‌ఖ సారాంశం. అంటే సిఎం జగన్ జస్టీస్ ఎన్ వి రమణతో పాటు కొంతమందిపై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ సుప్రీంకు లేఖరాస్తే.. అందుకు భిన్నంగా ఉండవల్లి లేఖ రాశారన్నమాట. ప్రజాప్రతినిధులపై వున్న కేసులను సత్వరం విచారణ చేయించడం అభినందనీయమని, ఓ మంచినిర్ణయమనీ, ఇందుకు అభినందనలు తెలుపుతున్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలను రాజమండ్రిలో మీడియా సమావేశంలో శనివారం ఉండవల్లి వివరించారు.

విచారణ జరగడం మంచి పరిణామం

ఏపీ ప్రభుత్వానికీ- న్యాయవ్యవస్థకూ మధ్య నడుస్తున్న పొరపొచ్చాల చర్చల నేపధ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.  ప్రజా ప్రతినిధుల మీద అవినీతి కావొచ్చు మరొకటి కావొచ్చు ఏదైనా వారి పలుకుబడి వున్నంత కాలం కేసులు విచారణ జరగవు, పరిష్కారం కావు అనేది జనంలో ఓ అభిప్రాయం వుండిపోయింది. కానీ అది నిజం కాదనే అంశాన్ని సుప్రీం తాజా నిర్ణయం రుజువుచేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.  ఇప్పటికైనా ఈ కేసులపైన విచారణ జరగడం రాజకీయాలలో , మన వ్యవస్థలో మంచి  పరిణామంగా చెప్పుకొచ్చిన ఉండవల్లి ఈ కేసుల  విచారణ  నేపధ్యంలో ఇపుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసు , సిఎం జగన్ పై వున్న కేసులు తెరమీదకు చర్చకు వచ్చాయి.

వర్చువల్ కోర్టులో విచారించండి

దివంగత  సిఎం వైఎస్ కుమారునిగా  జగన్ పై నాడు క్విడ్ ప్రో కేసులు నమోదైతే ఇపుడు సిఎం స్థాయిలో ముద్దాయి గా జగన్  కేసుల ట్రయల్ నడవబోతున్నాయని ఉండవల్లి అన్నారు. అయితే ఈ కేసులలో నిజమెంత వుందో ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేలా  వర్చువల్ కోర్టులో కేసులు వాదించడంతో పాటు ఏపీ ప్రజాప్రతినిధులు కేసులు విచారణ అంతా  లైవ్ టెలికాస్ట్ పెట్టాలని సుప్రీం చీఫ్ జస్టీస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కోర్టులో కేసుల త్వరతగతిన విచారణకే వర్చువల్ కోర్టు ఉపయోగపడుతుందని, అదే సమయంలో లైవ్ టెలికాస్ట్ పెడితే ప్రజలకు వాస్తవాలు తెలిస్తాయని, అందుకయ్యేఖర్చును భరించడానికి అనేక మంది మీడియా సంస్థలు ముందుకు వస్తాయని సలహా ఇచ్చారు.

సీఎం లేఖ రాయడం కొత్త కాదు

న్యాయవ్యవస్థపై సిఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాయడంపై స్పందించిన ఉండవల్లి ఇదేమీ కొత్తఅంశం కాదు. గతంలో కూడా ఇలాంటి లేఖలు రాసిన దాఖలాలు వున్నాయి.  లేఖ రాయడం తప్పకాదుకానీ, మీడియా సమావేశం పెట్టి విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. అలా  మీడియా ముందు చూపిస్తే ప్రజలకు తెలుస్తుందని కావొచ్చు అయితే అలా బయటపెట్టకుండా వుంటే బాగుండేది అన్నారు ఉండవల్లి.. ఇదే తరహాలో 1961లో అప్పటి సిఎం దామోదరం సంజీవయ్య కూడా అప్పటి న్యాయమూర్తులపై ఇలాగే ఒక లేఖ కేంద్ర హోం శాఖకు రాశారు.  అప్పటి న్యాయముార్తులు చంద్రారెడ్డి, సత్యనారాయణరాజులు వ్యవహారశైలి తప్పుపడుతూ వారిని బదిలీ చేయమని, వారిపై చర్యలు తీసుకోవాలని సంజీవయ్య సూచించారు. అయితే నాడు సంజీవయ్య  రాజీనామా చేసిన తర్వాత నాలుగేళ్ళ వరకూ ఆ లేఖపై స్పందన లేదు. ఆ తర్వాత  న్యాయమూర్తులు చంద్రారెడ్డి, సత్యనారాయణ రాజులను బదిలీలతో పాటు పదోన్నతులు కూడా కల్పించాయి. చంద్రారెడ్డి గవర్నర్ కూడా అయ్యారని, సత్యనారాయణరాజు ప్రధాన న్యాయమూర్తి అయ్యారనే నాటి పరిణామాలను ఉదాహరణలతో , అప్పటి రెడ్డి లాబాయింగ్ బలంగా వున్న సమయంలో అలా జరిగిందన్నారు.

కేంద్రం జోక్యం చేసుకోకపోవచ్చు

ఇపుడు సిఎం జగన్ రాసిన లేఖపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. అయితే అలా చేసుకుంటుందని తాను అనుకోవడం లేదన్నారు. కోర్టు జడ్జిమెంట్లు విషయంలో సుప్రీం న్యాయమూర్తుల ప్రమేయం వుంటుందని తాను  విశ్వసించడం లేదని, రెడ్డి, కమ్మలాబీయింగ్ మాత్రం న్యాయవ్యవస్థలో పనిచేస్తుందనే అభిప్రాయాన్ని నాటి పరిణామాలను ఉదాహరిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యక్తం చేశారు. జడ్జి కుమారులో, కుమార్తెలో భూములు కొనుగోలు చేసుకుంటే తప్పేమిటిని ఉండవల్లి ప్రశ్నించారు. భూములు కొనుగోలు చేసుకుంటే వీరెందుకు కంగారు పడాలని ఆయన ప్రశ్నించారు. ఎన్ వి రమణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకునేందుకు అవకాశాలు తక్కువగా వున్నాయని అన్నారు. ఎందుకంటే పార్లమెంటు, రాజ్యసభ ఈ అంశంలో కలగజేసుకోవలసివుంటుందని, అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుత కేంద్రప్రభుత్వంలో తలెత్తే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన చర్చ న్యాయవవస్థపై జరగాల్సివుందన్నారు. సిఎం జగన్ పై ఆరోపణలు ఏమిటో తెలియాలి.

అవి వైఎస్ మీద కేసులు

సిఎంగా వైఎస్ ఇచ్చిన  ఆర్డర్ ల క్విడ్ ప్రోకో  లో  జగన్ మీద కేసులు నమోదయ్యాయి. కానీ ఆ కేసులు జగన్ మీద కాదు వైఎస్ మీద. ఆయన ఇపుడు లేరు. ఆయన అలా చేస్తాడని అనుకోను. క్విడ్ ప్రోకో అని రుజువు అయితేనే ఇందులో క్రిమినల్ కేసు అవుతుంది. ప్ర్రూవ్ చేయాల్సిన అవసరం వుంది. అయితే జగన్ నేరుగా దొరకడం లేదు. ప్రక్కవారు దొరుకుతున్నారు. ప్రక్కవాళ్లని వదులుకోవడానికి జగన్ సిద్దంగా వున్నారో లేదో తెలియదు. నాకు తెలియదని జగన్ అన్నారనకో బయటపడొచ్చు..  జయలలిత మీద కేసుల్ని శశికళ భరించింది. జగన్ వ్యాపారంలో  ఒక వ్యాపారి ఎన్నితప్పులు చేయాలో, మ్యాజిక్ లు చేయాలో అన్నీ చేశాడు. ఛార్జీషీట్స్ చదివితే అందరి సంగతులు తెలిస్తాయి. అందులో వున్నవారికి మంచిమంచి పదవులిచ్చారు. ప్రభావితం చేస్తారనే జైలులో పెడతారు. ఆయన బయటవున్నా, లోపలున్నా ప్రభావితం చేయలేడా అంటూ ఉండవల్లి అన్నారు. జగన్ మీద ఎన్నిఆరోపణలు వచ్చినా ఏనాడూ స్వయంగా ఆయన ఖండించలేదనే అంశాన్ని కూడా ఇపుడు ఆలోచించాలి.. లక్షకోట్లు అవినీతి అని తెలుగుదేశం చంద్రబాబునాయుడు ఒకే ప్రచారం చేశారని అన్నారు. అందుకే విచారణ సమయంలో లైవ్ పెడితే బాగుంటుందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles