Thursday, April 25, 2024

సంసారాల్లో స్మార్ట్ ఫోన్ సరిగమలు!

  • స్మార్ట్ ఫోన్ లే సర్వస్వం
  • దాంపత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి
  • వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి
  • విజ్ఞానం అజ్ఞానంగా మారుతోంది

ఏ ఇంట చూసినా స్మార్ట్ ఫోన్ల సందడే! ఐదేళ్ల కుర్రాడి నుండి ఎనభై  ఏళ్ల తాత వరకు చేతుల్లో ఫోన్ లేనిది పొద్దు గడవడం లేదు! ఫోన్ల వల్ల సంసారాల్లో ఘర్షణలు తగ్గాయా? మానవ జీవితంలో మధుర క్షణాలు కోల్పోతున్నారా? కుటుంబ వ్యవస్ధ కూలిపోకుండా ఫోన్లు కాపాడుతున్నాయా? విలువైన పని గంటలు కోల్పోతున్నామా? సంపాదన మీద ధ్యాస తగ్గిందా? శృంగార చిత్రాలు మనసును పక్కదారి పట్టిస్తున్నాయా? వివాహేతర సంబంధాలకు  వాట్సప్ లు, పేస్ బుక్ లు వేదికలు అవుతున్నాయా? భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య స్మార్ట్ ఫోన్ లు దూరం పెంచు తున్నాయా? ఇవన్నీ ప్రశ్నలు కాదు. నిజాలు! ఇవ్వాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది! ఉన్న నలుగురూ నాలుగు గదుల్లో కూర్చుని ఎవరికి తోచిన ఎంటర్ టైన్ మెంట్ వారు పొందుతున్నారు! ఇప్పుడు ఈజీ మనే ఒక ఫోన్!! ఒక టాక్సీ నడిపించే వాడు ఐదు గంటల్లో తన టార్గెట్ పూర్తి చేసి… అంటే వెహికిల్ రెంట్, పెట్రోల్, తన రోజు సంపాదన వెయ్యి  రూపాయలు గిరాకీ చేస్తే చాలు స్మార్ట్ ఫోన్ ల్లో తల పెట్టడం! ఆ వెహికిల్ నడిపించే అప్పుడు కూడా ఇయర్ పిన్స్ చెవులకు తగిలించుకుని తన్మయత్వం తో పాటలో, మాటలో వినడం వల్ల ఈ లోకం పోకడ వాళ్ల చెవికి ఎక్కడం లేదు. తిన్నామా… ఫోన్ చూశామా అన్న ధ్యాసే తప్పా జీవితం గోల్ ఏనాడో మరిచి పోయారు.

కార్తీక దీపం సీరియల్ పైనే ధ్యాస

ఇంట్లో వంట వండే గృహిణి కూడా వంట చేసుకుంటూ టీవీ లో ప్రసారం అయిపోయిన  కార్తీక దీపం సీరియల్ ను చూస్తుంది… మొగుడు సరుకులు తెచ్చి పడేస్తే చాలు.. ఉప్పు కారం వేయకుండానే తిన్నామా అనుకునే జంటలు ఉన్నాయి అంటే నమ్ముతారా? ఉన్నాయనే చెబుతున్నాము! ఉప్పు వేయకుంటే అప్పటి కప్పుడు కూరలో ఉప్పు కలుపుకొని తింటూ ఫోన్ ను మాత్రం చేతుల్లో నుండి వదలడం లేదు! ఒక మానసిక శాస్త్ర వేత్త చేసిన పరిశోధనల్లో ఎలాంటి ఘర్షణలు లేక ఇప్పుడు ఇళ్ళు ప్రశాంతంగా ఉంటున్నాయట! మానవ సంబంధాలు దిగజారడానికి ముమ్మాటికి ఫోన్లే కారణం. సైకలాజికల్ సైన్స్, యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా సైకాలజీ ప్రొఫెసర్ స్బారా స్మార్ట్ ఫోన్ ల వాడకంపైన విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. స్నార్ట్ ఫోన్ల వల్ల మానవ సంబంధాలు మంట గలిశాయని ఆమె చెబుతున్నారు. మన దగ్గరి సంబంధాలలో ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు మనుషులను క్షణం తీరిక లేకుండా చేస్తూన్నాయట. మానవులు తమ స్మార్ట్‌ఫోన్‌ల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు అనేదానికి వారు వివరణను కూడా ప్రతిపాదించారు. ఇది మానవ పరిణామ క్రమంలో భాగమే అని వారు అంటున్నారు.

స్మార్ట్ ఫోన్ల ద్వారా కనెక్టు అవుతున్నాం

మానవులు స్మార్ట్ ఫోన్ల వల్ల ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి కష్టపడుతున్నారని సైకాలజిస్ట్ లు అంటున్నారు.  పరిణామ చరిత్రలో, వ్యక్తులుగా మరియు ఒక జాతిగా ఈ రోజుల్లో మనుగడ కోసం మేము  మా కుటుంబం అంతా  నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలపై ఆధారపడ్డాము. ఈ సంబంధాలు నమ్మకం, సహకారం మీద ఆధారపడి ఉన్నాయి, ఇది ప్రజలు తమ గురించి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసినప్పుడూ, ఇతరులకు ప్రతిస్పందించేటప్పుడూ ఆగాధం పూడ్చలేనంతగా ఉంది అని వారు అంటున్నారు.

దొంగతనం ఎలా చేయాలో, దొంగను ఎలా పట్టుకోవాలో…

స్మార్ట్‌ఫోన్‌లు, టెక్స్ట్ మెసేజింగ్, సోషల్ మీడియాకు అవి నిరంతరం అందించే ప్రాపకం ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, వారి సోషల్ నెట్‌వర్క్‌లలో ఇతరులకు ప్రతిస్పందించడం గతంలో కంటే సులభం అయిందని సైకాలజిస్టులు అంటున్నారు. దీని వల్ల అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విజ్ఞానం అజ్ఞానం అయి కూర్చుంటుంది.

యూ ట్యూబ్ లో దొంగ తనం ఎలా చేయాలో,  బైక్ తాళాలు ఎలా తీయాలో దృశ్య రూపకంగా చూపిస్తున్నారు. అవి చూసి దొంగతనాలు చేసే వారిని ఎలా పట్టుకోవాలో మరో యూ ట్యూబ్ లో చూపిస్తారు…వాడు దొంగ తనం చేసిన స్పాట్ నుండి  ఎక్కడికి వెళుతున్నాడో, ఏ   పెట్రోల్ బంక్ దగ్గర  ఆగాడో తెలుసుకునేందుకు పోలీసులు సిసి కెమెరాలు వైఫై కి అనుసంధానం చేయడం వల్ల వెంటనే దొరికి పోతున్నారు. విచిత్రం ఏమిటంటే పోలీసుల నుండి ఎలా తప్పుంచుకోవాలో కూడా యూ ట్యూబ్ ఛానల్ వారు ఇచ్చే టెక్నీక్ వల్ల కొద్దీ రోజులు మాత్రం పోలీసులు హైరానా పడుతున్నారని తెలిసి సైబర్ టెక్నాలజి డెవలప్ చేసి గుట్టల్లో పుట్టలో దాగిన నెరస్థులను కూడా ఆధారాలతో పట్టిచ్చే పరికరాలు వచ్చాయి కాబట్టి శాంతి భద్రతల అదుపులో ఉన్నాయి. ఈ ఇరవై ఏళ్లలో సాంకేతిక పురోగతి పెరిగింది. మానవ శ్రేయస్సు కోసం ఏర్పడ్డ ఈ టెక్నాలజీ భస్మాసుర హస్తం అయింది. ఈ మార్పులు మానవ జీవితాలకు మచ్చ గా తయారయ్యాయి.

సంఘర్షణగా వాస్తవ సంబంధాలు

వర్చువల్ కనెక్షన్లు పెరిగిపోయాయి. వాస్తవ  ప్రపంచ సంబంధాలు  సంఘర్షణ గా మారిపోతున్నాయి. అశ్లీల దృశ్యాలు చూడడం వల్ల వైవాహిక సంబంధాలు అతి పోకడలు పోతున్నాయి. కాలేజీ ఏజ్ నుండి మిడిల్ ఏజ్ వరకు వావి వరసలు లేని సంబంధాలు ఏర్పడుతున్నాయి. “సారా దునియా ముట్టీ మే” అన్న నినాదం ఖండాంతర  ప్రేమలకు దారి తీసి పరస్పర తాత్కాలిక ఆకర్షణ లతో  యువతరం భవిష్యత్ అంధకారం అవుతోంది. జూమ్ మీటింగ్ లు…హోటల్ పాస్ట్ ఫుడ్ అర్దర్ల వల్ల సంప్రదాయ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు చిచ్చు రేపుతున్నాయి. పిల్లలతో పొసగక పెద్ద వారు ఓల్డ్ ఏజ్ హోం లు చూసుకుంటున్నారు.

అన్నీ యూట్యూబ్ ప్రయోగాలే

కూర చేసినా, చారు చేసినా, అన్నీ యూ ట్యూబ్ ప్రయోగాలే అవుతున్నాయి. కాళ్లకు పారణి, ఇంటి ముందు కల్లాపి సంస్కృతి పోయి సంక్రాంతి వెలవెల బోయింది. బంధువులు అంతా ఎవరి ఫోన్ లలో వారు తలమునకలు అయ్యారు. పండుగ కళ మా ఇంట్లో లేకుండా పోయిందని ఒకరు, పెళ్ళాం ఒక్కరితో మొగుడు మరొకరితో చాట్ లో తలపెట్టేసి  అదే అసలైన జీవితం అనే భ్రమలో కలల ప్రపంచంలో విహరిస్తున్న జనం నిజ జీవిత మధుర్యాలను చవిచూసే లోపే రేడియేషన్ తో బ్రెయిన్ డెత్ అవుతున్నారు. ప్రభుత్వాలకు, బిజినెస్ మెన్ లకు ఇవేమీ పట్టవు. కొత్త యాప్ లకు , సరికొత్త ప్యాకేజ్ లకు వాళ్ళు పర్మిషన్ ఇస్తూనే ఉంటారు. మానవ బలహీనతలను సొమ్ము చేసుకుంటూనే ఉంటారు.

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles