Friday, March 29, 2024

దుబ్బాకలో 6 మంది ఉస్మానియా విద్యార్థుల నామినేషన్

దుబ్బాక ఉపఎన్నికలో శుక్రవారం నాడు ఆరుగుదు ఉస్మానియా విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజునే ఆరు నామినేషన్లూ పడటం విశేషం. అక్టోబర్ 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 19వ తేదీ వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. పోలింగ్ నవంబర్ 3న, ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న.

మొదటి రోజు నామినేషన్లు దాఖలు చేసిన విద్యార్థుల పేర్లు: బుర్రా రవితేజ, రేవు చిన్న ధనరాజ్, సిల్వేరు శ్రీకాంత్, మోతె నర్సయ్య, మీసాల రాజాసాగర్, కొత్త శ్యాంకుమార్. వీరంతా స్వతంత్ర అభ్యర్థులే. తాము నిరుద్యోగ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేందుకు నామినేషన్లు దాఖలు చేశామని వారు చెప్పారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తమ్, జీవన్ ప్రచారం

శుక్రవారం నాడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మొక్కజొన్న రైతులను కలుసుకున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే ఎల్ ఆర్ ఎస్ (ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం)కి వ్యతిరేకంగా పోరాడుతామనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎల్ ఆర్ ఎస్ పథకం అంటూ ఉండదనీ, ఉచితంగానే భూముల క్రమబద్ధీకరణ జరుగుతుందనీ హామీ ఇచ్చారు. ఎల్ ఆర్ ఎస్ లో మానవీయ కోణం ఏ మాత్రం లేదనీ, డబ్బులు వసూలు చేయడం కోసం ఉద్దేశించిన పథకం మాత్రమే కానీ ప్రజలకు మేలు చేసే సదుద్దేశం టీఆర్ ఎస్ ప్రభుత్వానికి లేదనీ కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తొలిసారి మహిళ దుబ్బాక ఎంఎల్ ఏ కాబోతున్నారు : హరీష్

ఇటీవలెనే భర్త రామలింగారెడ్డిని కోల్పోయిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురిలాగా చూసుకుంటున్నారనీ, మొట్టమొదటి సారి దుబ్బాక నుంచి అసెంబ్లీకి ఒక మహిళ ఎన్నిక కాబోతున్నారనీ, నియోజకవర్గంలోని మహిళలందరూ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి ఆమె గురించి కారుకూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలనీ హరీష్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులవి మాటలు ఎక్కువనీ, చేతలు తక్కువనీ మంత్రి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు :

దుబ్బాక: ఇద్దరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో ప్రవేశం

Related Articles

2 COMMENTS

  1. Excellent read, I just passed this onto a friend who was doing a little research on that. And he actually bought me lunch because I located it for him smile So let me rephrase that: Thanks for lunch!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles