Monday, November 11, 2024

సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక

సింగరేణి యాజమాన్యం తన ప్రగతి నివేదికను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సమర్పించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్ లో అత్యద్భుత వృద్ధిని సాధించినట్లు నివేదికలో పొందుపరిచింది.

  • తెలంగాణ రాకపూర్వం 2013-14లో 504 లక్షల టన్నులు ఉన్న బొగ్గు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఆరు ఏళ్లలో 21 శాతం వృద్దితో 2019-20లో 640 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరింది.
  • తెలంగాణ రాకపూర్వం 2013-14లో 479 లక్షల టన్నులు బొగ్గు రవాణా చేసిన కంపెనీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఆరు ఏళ్లలో 30 శాతం వృద్ధితో 2019-20లో 625 లక్షల టన్నుల బొగ్గు రవాణాను చేయగలిగింది.
  • తెలంగాణ రాకపూర్వం 2013-14లో 11,928 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడచిన ఆరేళ్లలో 103 శాతం వృద్ధితో 2019-20 సంవత్సరంలో 24,208 కోట్ల రూపాయల టర్నోవర్‌ను కంపెనీ సాధించగలిగింది.
  • అలాగే తెలంగాణ రాకపూర్వం 2013-14లో నికర లాభాలు 419 కోట్ల రూ పాయలు మాత్రమే కాగా మన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2019-20లో 137 శాతం వృద్ధితో 994 కోట్ల రూపాయల లాభాలను కంపెనీ ఆర్జించింది.
  • సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడమే కాక రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి సెప్టెంబర్ 2016 నుండి ఫిబ్రవరి 2021 వరకూ 38,454 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా దీనిలో 36,126 మిలియన్ యూనిట్ల విద్యుత్తును రాష్ట్రానికి సరఫరా చేయడం జరిగింది.

Also Read: మహాన్ భారత్ ఏమైపోతోంది?

  • రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటులను ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 10 మెగావాట్లు, ఇల్లందులో 15 మెగావాట్లను ప్లాంటులను ఇటీవలనే ప్రారం భించడం జరిగింది. దీనితో మొత్తం 85 మెగావాట్ల సోలార్ విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేయడం జరిగింది.
  • ఏప్రిల్ 2021 నాటికి తొలిదశలో 129 మెగావాట్ల సోలార్ ప్లాంటులు పూర్తయి విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నాయి. రెండవ దశలో 90 మెగావాట్లు ఏప్రిల్ 2021 నాటికి, మూడవ దశలో 81 మెగావాట్లు సెప్టెంబర్, 2021 నాటికి పూర్తికానున్నాయి.
  • తెలంగాణ రాకపూర్వ పది సంవత్సరాలలో 6,453 ఉద్యోగాలు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సింగరేణి సంస్థలో మెత్తం 13,808 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
  • లాభాల బోనసను తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత భారీగా పెంచి పం పిణీ చేయడం జరిగింది. 2014లో 18 శాతం ఉండగా, 2015లో 21 శాతం, 2016లో 23 శాతం , 2017లో 25 శాతం , 2018లో 27 శాతం , 2019లో 28 శాతానికి పెంచి పంపిణీ చేయడం జరిగింది.
  • గతంలో పండుగ అడ్వాన్సు పది వేల రూపాయలు మాత్రమే ఉండగా, 2015లో 16 వేల రూపాయలు, 2016లో 18 వేల రూపాయలు, 2017 నుం చి 25 వేల రూపాయలకు పెంచి అదజేయడం జరుగుతోంది.
  • ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికునికి కంపెనీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటును పది రెట్లు పెంచి చెల్లించడం జరుగుతోంది. గతంలో ఒక లక్ష రూపాయులుగా ఉన్న ఈ మ్యాచింగ్ గ్రాంటును ఇప్పుడు పది లక్షల రూ పాయలకు పెంచి చెల్లిస్తున్నారు.
  • డింపెండెంటు ఎంప్లాయిమెంట్-ఎం.ఎం.సీ. కి బదులు గతంలో ఏక మొత్త ంగా 5 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం దీనిని 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది.
  • గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల ఆదేశంతో కార్మికుల స్వంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రుణం వరకు సింగరేణి వడ్డీ చెల్లించే పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోంది.
  • గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆదేశంపై సింగరేణి కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించటం జరుగుతోంది.
  • గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణి అన్ని ఏరియాల్లోని కార్మికుల కాలనీల్లోని క్వార్టర్లకు ఏసీ, సౌకర్యం కోసం కంపెనీ చర్యలు తీసుకొంది.

Also Read: సింగరేణిలో ఎంఎల్సీ ఎన్నికల లొల్లి

  • ఐఐటీ, ఐఐఎం చదివే కార్మికుల పిల్లల ఫీజులను కంపెనీయే చెల్లిస్తోంది.
  • మెడికల్ అన్ ఫిట్ ద్వారా ఉద్యోగం వద్దనుకునే వారికి ఏక మొత్తంగా 25 లక్షల రూపాయలు చెల్లింపు లేదా నెలకు 26,293 రూపాయలు చెల్లించే పథకం ప్రవేశ పెట్టడం జరిగింది.
  • మహిళా ఉద్యోగినులకు 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచడం జరిగింది. అలాగే వారికి చైల్డ్ కేర్ లీవు ఇవ్వడం జరుగుతోంది.
  • గనులలోని క్యాంటీన్లను ఆధునీకరించి, కార్మికుల అభిప్రాయం మేరకు నాణ్యమైన తినుబండారాలు అందజేయటం జరుగుతోంది. గనుల్లో కొత్త బాత్ రూమ్ ల నిర్మాణం, అన్ని ఏరియాల్లో స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, ఏర్పాటు, పర్యావరణ హిత పార్కుల నిర్మాణం వంటివి చేయడం జరిగింది.
  • కార్మికులు చెల్లించే విద్యుత్ బిల్లు రద్దు చేయవల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించగా దీనిపై తక్షణమే సర్క్యూలర్ జారీ చేసి ఈ మినహాయింపును వర్తింపజేయడమైనది.
  • పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయం అం దిచాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించగా దీనిపై వెంటనే రిటైర్మెంటు మెడికల్ స్కీం (సీ.పీ.ఆర్.ఎం.ఎస్)ను అమలు చేయడం జరిగింది. వేలాది మంది రిటైర్డు ఉద్యోగులు ఈ స్కీను సద్వినియోగం చేసుకుంటున్నారు.
  • 4,174 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజూర్లుగా రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
  • గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశంపై అంబేద్కర్ జయంతి, రం జాన్, మరియు క్రిస్మస్ పండుగ దినాలను సెలవులుగా ప్రకటించడం జరిగింది.
  • తెలంగాణ రాష్ట్ర సాధనకు అద్భుతమైన పోరాటం చేసిన సింగరేణీయులం దరికి తెలంగాణ ఇంక్రిమెంట్ ను మంజూరు చేయడం జరిగింది.

Also Read: సెప్టెంబర్‌ కల్లా 300 మెగావాట్ల సింగరేణి సోలార్‌ సిద్ధం..

  • కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏడాదికి 50 కోట్ల రూ పాయలతో సమీప గ్రామాలు, పట్టణాలలో మౌళిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది.
  • డీఎంఎ షీ నిధుల కింద సింగరేణి గనులు విస్తరించి ఉన్న ఆరు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 2,740కోట్ల రూపాయలను సబంధింత జిల్లా కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయడం జరిగింది.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles