Tuesday, April 23, 2024

రావణాసురిడిని తూలనాడిన శూర్పణఖ

రామాయణమ్70

రావణుడు కొలువుకూటములో ఉన్నతమైన రత్నఖచిత సింహాసనము మీద ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా మహాతేజస్సుతో కూర్చొని ఉన్నాడు.

ఆ రాక్షస రాజు శరీర కాంతి నున్నని వైఢూర్యమాణిక్యపు  కాంతివలె ఉన్నది. కాల్చి శుద్ది చేసిన బంగారు కుండలములు ధరించి ఉన్నాడు. అందముగా ఉన్న భుజాలు, తెల్లని దంతకాంతి, పెద్ద ముఖముతో పర్వతములాగా ఉన్నాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు.  .బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపమాచరించి ఆయనకు తన శిరస్సులు అర్పించినవాడు.

Also read: సీతను రావణుడు అపహరించాలని అకంపనుడి వ్యూహం

ఆతని శరీరము మీద ఎక్కడ చూసినా ఆయుధాల దెబ్బలు మానిన గుర్తులే!

మరీ విశేషముగా ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలే అవి!

అవి ఒక యోధుడికి అలంకారములు.

వాడు మృత్యువుకే మృత్యువు!

Also read: ఖర,దూషణాదులను యమపురికి పంపిన రాముడు

వాడు మహా క్రూరుడు, పూర్తికావచ్చిన యజ్ఞాలను ధ్వంసము చేసి వికృతానందము పొందేవాడు.

వాడి కంటికి అందముగా కనపడ్డ ప్రతి స్త్రీ వాడి స్వంతము కావలసినదే. అలాంటి స్త్రీని దక్కించుకోవడానికి వాడు ఎంతటి సాహసమైనా చేస్తాడు.

వాడు ఒకసారి  మహావిషసర్పము తక్షకుడి భార్యను చూశాడు. అంతే వాడి మనసు నిలవలేదు. భోగవతిని ముట్టడించాడు.  రాజైన వాసుకిని ఓడించాడు. తక్షకుడి ప్రియభార్యను బలాత్కారముగా తెచ్చుకున్నాడు.

Also read: సీతను రావణుడు అపహరించాలని అకంపనుడి వ్యూహం

కుబేరుడి మీదకు దండయాత్రకు పోయి అతడి పుష్పకవిమానాన్ని తెచ్చుకున్నాడు.

వాడికి కోపము వస్తే అలా వెళ్ళిపోయి దేవతల చైత్రరధాన్ని, నందనవనాన్ని, పద్మసరస్సును ఊరకే పాడుపాడు చేసేవాడు.

యజ్ఞధ్వంసము నందు ఆసక్తి, బ్రహ్మహత్యలు వాడికి అలవాటు, కఠినుడు, దుష్టప్రవర్తనగలవాడు, జాలిలేదు, ప్రజలకు అహితము చేయటములో వాడికి ఆసక్తి మెండు.

కొలువుదీరి ఉన్న మహాభయంకరుడైన రాక్షరాజు వద్దకు వచ్చి వాలింది శూర్ఫణఖ. అది భయము, కోపము, అవమానము ,కలగలసిన తత్తరపాటుతో ఉన్నది. అది ఇంతవరకు జీవితములో రాముడిలాంటి యోధుడిని చూడలేదు. వినలేదు.  అంతటి దెబ్బ ఎప్పుడూ తినలేదు. కొలువుదీరి ఉన్న మహాభయంకరుడైన రాక్షరాజు వద్దకు వచ్చి వాలింది శూర్ఫణఖ. అది భయము, కోపము, అవమానము ,కలగలసిన తత్తరపాటుతో ఉన్నది. అది ఇంతవరకు జీవితములో రాముడిలాంటి యోధుడిని చూడలేదు. వినలేదు.  అంతటి దెబ్బ ఎప్పుడూ తినలేదు.

మంత్రులతో కూర్చొని సమాలోచనలు చేస్తున్నాడు రావణుడు. సుడిగాలిలా వచ్చి అతడి ముందు వాలింది శూర్పణఖ. వచ్చీ రావడముతోనే రావణుని నిందించడము మొదలుపెట్టింది

నీవేమి రాజువు> నీకు పోగాలము దాపురించినదిలే. అసలు బయట ప్రపంచములో ఏమి జరుగుతున్నదో నీకు పడుతున్నదా? అవునులే, నీ గూఢచార వ్యవస్థ అంత దరిద్రముగా తగలబడ్డది,

Also read: శూర్పణఖ ముక్కుచెవులు కోసిన లక్ష్మణుడు

నీపాటికి నువ్వు హాయిగా నచ్చిన దానితో కులుకుతూ, భోగాలలో మునుగుతూ కాలము వెళ్ళబుచ్చుతున్నావు. నీకు భోగాలు ముఖ్యమని అనుకుంటూ కాలము గడుపుతున్నావు నీలాంటి రాజును జనులు స్మశానపు అగ్ని లాగ గౌరవించరు. భోగాలలో మునిగిన రాజు సముద్రములో మునిగిఉన్న పర్వతము లాగా శోభిల్లడు. ఇంత చపల చిత్తుడవు  నీవు రాజు ఎలా కాగలిగావు? నీకు పరాక్రమం ఒకటుంటే  సరిపోదు. గూఢచార వ్యవస్థ, కోశాగారము, పరిపాలనా వ్యవహారము నీ అధీనములో ఉంచుకోవటము తెలవాలి. అప్పుడే నీ రాజ్యము స్థిర పడుతుంది.

అసలు నీవేమి తెలుసుకుంటున్నావో నాకు తెలియటము లేదు. అక్కడ జనస్థానములో కొంపలంటుకుంటున్నాయి. నీ సైన్యము పదునాల్గు వేల మందినీ ఒకడు ఊచకోత కోశాడు, దూషణుడు, త్రిశిరుడు, మహాబలశాలి ఖరుడు అందరూ ఆ ఒక్కడి చేతులలో ఒకేసారి చనిపోయారు.

వాడు రాముడు!

ఆ రాముడు ఋషులకు అభయమిచ్చినాడు వారికి రాక్షస బాధ లేకుండా చేస్తానని.

ఎండిన కర్రలు, మట్టిబెడ్డ, బూడిద వీటివల్ల ఉన్న ఉపయోగము కూడా స్థాన భ్రష్టుడు అయిన నీ వంటి రాజు వల్ల ఉండదు.

శూర్పణఖ మాట్లాడే మాటలు రావణుడి హృదయములో క్రోధాగ్నిజ్వాలలు రేపుతున్నాయి ,

మంత్రుల సమక్షములో ఆ విధంగా చిన్నబుచ్చుతూ మాట్లాడింది. ఎరుపెక్కిన కన్నులతో ఇలా అన్నాడు,

‘‘ఎవడా రాముడు? ఎట్లాంటిది వాడి బలము? అసలు అంత దుర్గమమైన దండకారణ్యములో వాడెందుకు ప్రవేశించాడు? అతని ఆయుధము ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

అప్పుడు శూర్పణఖ,

అతడు దశరథ కుమారుడు. ఆజానుబాహువు. విశాలమైన నేత్రాలున్నవాడు. నారచీరను, కృష్ణాజినమును ధరించిఉన్నాడు. మన్మధుడితో సమానమైన  సౌందర్యము ఆతనిది!

కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజః

అని పలికి రాముడి పరాక్రమాన్ని వర్ణించ సాగింది.

Also read: శ్రీరామచంద్రుడిపై మనసు పారేసుకున్న శూర్పణఖ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles