Thursday, September 28, 2023

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం

  • బిశ్వభూషణ్ తో నిమ్మగడ్డ సమావేశం
  • ఈసీ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు
  • ఎస్ఈసీ పిటీషన్ పై విచారణ వాయిదా వేసిన డివిజన్ బెంచ్

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎస్ఈసీ తరపున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఎస్ఈసీ పిటీషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ నెల 17 వరకు ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. దీంతో డివిజన్ బెంచ్ తదుపరి విచారణను  ఈ నెల 18కి వాయిదా వేసింది.    

ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో  ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమీషన్ కార్యదర్శి వాణీ మోహన్ ను ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగించారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయంలో వాణీమోహన్ సేవలు అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఆదిత్యనాత్ దాస్ కు లేఖ రాశారు. నిమ్మగడ్డను ఎస్ఈసీగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సమయంలో ఎన్నికల సంఘం కార్యదర్శిగా 1996 బ్యాచ్ కు చెందిన వాణీ మోహన్ ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుండి ఆమె కమిషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఆమె సేవలు అవసరం లేదని  కమిషన్ కార్యాలయం నుంచి వాణీ మోహన్ ను రిలీవ్ చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసిన హైకోర్టు

ఎన్నికల సంఘం కార్యకాలపాలకు ఓ పథకం ప్రకారం విఘాతం కలిగించి పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎన్నికల సంఘం విధులనుంచి తొలగించిన మరుసటి రోజే వాణి మోహన్ ను తొలగించారు. 

గవర్నర్ తో భేటీ అయిన నిమ్మగడ్డ:

అంతకు ముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, తాజా పరిణామాలపై గవర్నర్ తో చర్చించారు. ఏఉద్దేశంతో తాను నోటిఫికేషన్ జారీ చేశారోనని గవర్నర్ కు వివరించారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు, కోర్టు తీర్పుపై   డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసిన విషయాలను గవర్నర్ కు వివరించారు.

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదన్న ఎస్ఈసీ

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles