Sunday, November 10, 2024

మరక మంచిదే

వినయం తెచ్చేది విద్య

అహం తగ్గితే వినయం

అహం తగ్గించేది చింతనం

చింతనం కలిగించేది కష్టం

మనసు గ్రహించేది కష్టం

మనసును నియంత్రించేది వైరాగ్యం

వైరాగ్య కారణం దుఖం

దుఖం నుండి విముక్తి వైరాగ్యం

సుఖం నుండి కూడా విముక్తి వైరాగ్యం

రాగం లేనిదే విరాగం

సరసుడి రాగం ఆనందం

విరసుడి రాగం బ్రహ్మానందం

ఆనంద నిరసనే సచ్చిదానందం.

Also read: ఙాన జ్యోతి

Also read: ఆనంద మార్గం

Also read: నిందాకృష్ణ

Also read: అంధాంద్ర

Also read: స్వామి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles