Friday, April 19, 2024

కంగారూలకు భారత్ పగ్గాలు

  • సిడ్నీటెస్టులో జడేజా స్పిన్ జాదూ
  • స్మిత్ సెంచరీతో ఆస్ట్ర్రేలియా 338 పరుగులు

సిడ్నీ టెస్టులో భారీస్కోరు సాధించాలన్న ఆస్ట్ర్రేలియాకు రెండోరోజుఆటలో భారత్ పగ్గాలు వేసింది. లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టడంతో తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్ర్రేలియా 338 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లబుషేన్ సెంచరీ మిస్…..

తొలిరోజు ఆట ముగిసే సమయానికి సాధించిన స్కోరుతో రెండో రోజుఆట కొనసాగించిన ఆస్ట్ర్రేలియా ను లంచ్ విరామానికి ముందే భారత బౌలర్లు కట్టడి చేయగలిగారు.

వన్ డౌన్ ఆటగాడు లబుషేన్ సెంచరీకి చేరువగా వచ్చి జడేజా బౌలింగ్ లో కెప్టెన్ రహానే పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.91 పరుగుల స్కోరుతోనే లబుషేన్ పెవీలియన్ దారి పట్టిక తప్పలేదు.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాథ్యూ వేడ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినా 13 పరుగుల స్కోరుకే జడేజా బౌలింగ్ లో చిక్కాడు. ఆల్ రౌండర్ గ్రీన్ డకౌట్ కాగా కెప్టెన్ టిమ్ పెయిన్ ఒకే ఒక్క పరుగుకు దొరికిపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ స్మిత్ తనదైన శైలిలో ఆడుతూ భారత బౌలర్ల దూకుడును సమర్థవంతంగా అడ్డుకొన్నాడు.

ఇది చదవండి: సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్

స్టీవ్ స్మిత్ సూపర్ టన్

టెస్ట్ క్రికెట్ రెండోర్యాంక్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఎనలేని ఏకాగ్రతతో ఆడి 226 బంతులు ఎదుర్కొని 131 పరుగులు సాధించాడు. 2021 క్రికెట్ సీజన్ లో తొలి శతకంతో బోణీ కొట్టాడు. గత ఏడాది మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమైన స్మిత్ ను ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో భారత స్పిన్నర్ అశ్విన్ తక్కువ స్కోర్లకే అవుట్ చేయగలిగాడు. గత నాలుగు ఇన్నింగ్స్ లో 1, 1, 0, 8 స్కోర్లకే పెవీలియన్ దారి పట్టిన స్మిత్ ఐదవ ఇన్నింగ్స్ లో భారత శతకం బాదడం విశేషం.

అంతేకాదు. భారత్ -ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య జరిగిన గత ఆరు టెస్టుల్లో శతకం బాదిన తొలి కంగారూ బ్యాట్స్ మన్ గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. భారత్ ప్రత్యర్థిగా 25 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ కు 8వ సెంచరీ కావడం కూడా రికార్డే. అంతేకాదు. టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మిత్ కు ఇది 27వ శతకం.

ఇది చదవండి: రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు

స్మత్ 131 పరుగుల స్కోరుకు రనౌట్ కావడంతో ఆస్ట్ర్రేలియా 105 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు సైనీ 2 వికెట్లు, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు.

సమాధానంగా భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ ఆచితూచి ఆడి చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

ఇది చదవండి: భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles