Saturday, April 20, 2024

కేసీఆర్, చిన్నజీయర్ స్వామిపై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తాయనీ, యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటున్నారనీ, అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారంనాడు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ప్రశ్నించారు.

టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం ఎలా చదువును అందిస్తారని ఆయన ప్రశ్నించారు. ‘‘సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తే పేదలు బాగుపడుతారు.కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాలను చేపట్టారు,’’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

‘‘పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదు- అయినా వాటిని మూసివేశారు. పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయి- అయినా వాటిని నియంత్రణ చేయరు. ఎందుకంటే ఆదాయం ఉంటుంది కాబట్టి. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేశారు. చదువును దూరం చేసి గొర్లు- బర్లు- చేపలు ఇస్తుండు. విద్యకు పెట్టె నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు- సమాజం దృష్టిలో పెట్టుబడి. తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డిలాంటి లీడర్లు పుట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయి. కేసీఆర్ మనువాది,’’ అంటూ కేసీఆర్ ను రేవంత్ దుయ్యపట్టారు.

‘‘టీఆరెస్ యూపీలో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తే ఎంఐఎంకి మిత్రద్రోహం చేస్తుండా కేసీఆర్? తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని యూపీలో ఎంఐఎంకి కాకుండా సమాజ్ వాదీపార్టీకి ప్రచారం చేస్తారా?’’ అంటూ ప్రశ్నించారు.

చిన్నజీయర్ స్వామిపైన విమర్శనాస్త్రాలు

మేము శైవులం కాబట్టే- వైష్ణవులు మమ్ములను అవమానిస్తున్నారా? సమానత్వం అని టైటిల్ పెట్టి- ఒక ఎంపీని- పార్టీ అధ్యక్షుడు గా ఉన్న నాకు రియలేస్టేట్ ఉద్యోగితో నాకు ఆహ్వానం పలుకుతారా? చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి మాకు ఆహ్వానం ఎందుకు రాలేదు? రియలేస్టేట్ వ్యవస్థ కోసం చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారు. చిన్నజీయర్ స్వామీజీ పై మాకు అపారమైన గౌరవం. రియలేస్టేట్ బ్రోకర్ ను పక్కనపెట్టుకొని తిరిగితే మాకు అనుమానాలు వస్తాయి. చిన్నజీయర్ స్వామి ల్యాండ్ గ్రాబర్ పక్కన పెట్టుకోని వ్యవస్థను, ఒక కంపెనీ కోసం దుర్వినియోగం చేస్తున్నారు. మోడీ ఏమి భక్తుడొ ఆయనకే తెలియాలి. చైనా విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్లడం ఏంటో!  స్వామీజీ అంత గొప్ప కార్యక్రమం- ఒక రియలేస్టేట్ సంస్థ కోసం చేస్తున్నారా? దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ ముందు మాత్రం సమానత కనిపించడం లేదు. ప్రధాని- రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకోని- రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆస్తులను పెంచడానికి ప్రభుత్వం పనిచేస్తోంది. చిన్నజీయర్ స్వామి దగ్గర రియలేస్టేట్ వ్యక్తులు ఉంటే ఆయన గౌరవానికి కరెక్ట్ కాదు. రియలేస్టేట్ సంస్థ కోసం చెట్లను నరకడం పై బీజేపీ కూడా సమాధానము చెప్పాలి. స్వామీజీ నేను కలిసి ఏమైనా చెప్పాలి అంటే ఆయన చుట్టూ రియలేస్టేట్ వ్యక్తులే ఉంటారు’’ అంటూ చిన్నజీయర్ స్వామిని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles