Friday, April 19, 2024

కాంగ్రెస్ ను చూసి జడుసుకుంటున్న బీజేపీ

  • సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులపై రేవంత్ వ్యాఖ్య
  • మోదీని గద్దె దింపే ఉద్యమానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందన్న టీపీసీసీ అధ్యక్షుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే కలలోకి వస్తున్నట్టుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు పై నమోదు చేసిన కేసును ఎనిమిదేళ్లుగా సాగతీస్తూ… తాజాగా  సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

‘‘బీజేపీది, బ్రిటీషువారిది ఒక్కటే భావజాలం. నాడు వారి అణచివేత, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది. ఇప్పుడు వారి భావజాలానికి వారసులైన బీజేపీ – మోదీ అణచివేత, కుట్రలకు వ్యతిరేకంగా అంతే ఉత్తేజంతో పోరాడుతుంది. నాటి స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేడు మోదీని గద్దె దింపే ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది,’’అని రేవంత్ వ్యాఖ్యానించారు.

‘‘తాజాగా ఈడీ నోటీసులు కాంగ్రెస్ అగ్రనాయకత్వ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై మా పోరాటాన్ని అడ్డుకోలేవు. ఈ పరిణామం మా కార్యకర్తలలో మరింత కసి, పట్టుదలను పెంచుతుంది. ఈ వేదింపులతో కాంగ్రెస్ కుంగిపోతుందని భావిస్తే అది వారి భ్రమ. అధికారం ఇస్తే విదేశాల నుండి నల్లధనం తెచ్చి, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ పేదలను మోసం చేశాడు. బ్యాంకులను ముంచిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దేశానికి తిరిగి తీసుకురాలేకపోయారు. 70 ఏళ్ల ప్రజల శ్రమ, చమట చుక్కలతో కాంగ్రెస్ నిర్మించిన వ్యవస్థలను మోదీ ధ్వంసం చేశారు. దేశ ప్రజల సంపదను అదానీకి అడ్డగోలుగా అమ్ముతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెంచేసి పేదల నడ్డి విరుస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అనే ప్రశ్నే ఉండదని నమ్మబలికి… దేశంలో మరింత నల్లధన వ్యాప్తికి కారకులయ్యారు. దేశంలో నయా బ్రిటీష్ పాలన నడుస్తోంది. దీనిపై సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతోంది. ఇది సహించలేకనే ఈడీ నోటీసులతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మోదీ భావిస్తున్నారు. అది జరిగే సమస్యే లేదు. పోరాడుతాం… గెలుస్తాం. దేశాన్ని గెలిపిస్తాం,’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఒక ప్రకటనలో సవాలు చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles