Thursday, March 28, 2024

ప్రముఖ నాస్తికుడు, సంఘసంస్కర్త రావూరి అర్జునరావు మృతి

రావూరి అర్జునరావు గోరాగారి పెద్దల్లుడు ( 105) ఆదివారం ఉదయం హైదరాబాద్ లొ మరణించారు. సోమవారం  ఉదయం విజయవాడలోని నాస్తిక కేంద్రంలో పార్థివ దేహాన్ని ఉంచుతారు. సోమవారం  మద్యాహ్నం  అర్జునరావు పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీ కి ఇస్తారు.

అర్జునరావు గోరా  పెద్దకుమార్తె మనోరమను గాంధీ సేవాగ్రాంలో 1942 లో వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి జవహర్ లాల్ నెహ్రూ, ఇతర కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు హాజరైనారు. అర్జునరావు  జీవితాంతం సామజిక పరివర్తనకొరకు , అంటరాని తనం నిర్ములన కొరకు , సమాజంలోని అసమాసనలతలను తొలగించేందుకు ఎంతో కృషి చెసాడు. హైదరాబాద్ లో అర్జునరావు తన కుమారుడు పవర్ నివాసంలో ఉంటున్నారు. అర్జునరావు 17 ఫిబ్రవరి 1917లో జన్మించారు.అర్జునరావు మరణానికి AP హేతువాదసంఘం తీవ్ర సంతాపం తెలియజేసిందని సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles