Saturday, April 20, 2024

హైకోర్టులో రమేష్ కుమార్ పిటిషన్

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.  వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ  ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles