Sunday, June 26, 2022

రైల్వేలో ఒక్కో సమస్య పరిష్కారానికి రూ. కోటిన్నర, స్టార్ట్ అప్ లకు ఆఫర్

వోలేటి దివాకర్

పట్టాలు విరిగిపోవడాన్ని, రైళ్ల రాకపోకల్లో అలస్యాన్నినివారించడం వంటి సమస్యలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నివారించే స్టార్ట్ అప్ సంస్థలకు రైల్వే శాఖ ఆఫర్ ను ప్రకటించింది. ఒక్కో సమస్య పరిష్కారానికి రూ. కోటిన్నర నగదు గ్రాంటు, ఆతరువాత అవసరమైన నిధులు అందజేస్తారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం పై మేధోహక్కులు ఆవిష్కరించిన స్టార్ట్ అప్ సంస్థలకే దక్కుతాయి. రైల్వే లో మొత్తం 100 సమస్యల పరిష్కారానికి స్టార్ట్ అప్ ల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది.

భారతీయ రైల్వే స్టార్టప్‌లు, ఇతర సంస్థల భాగస్వామ్యంతో నూతన ఆవిష్కరణలకు చొరవ తీసుకుంది. దీనిలో భాగంగా  రైల్వే , కమ్యునికేషన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విణీ వైష్ణవ్‌  ఢిల్లీ రైల్‌ భవన్‌లో ‘‘రైల్వేల కోసం స్టార్టప్స్‌’’ విధానాన్ని ప్రారంభించారు.

11 సమస్యల పరిష్కారానికి స్టార్టప్స్ కు అప్పగింత

రైల్వేలోని వివిధ జోన్లు, క్షేత్రస్థాయిలోని కార్యాలయాలు, జోన్ల నుండి అందుకున్న 100కు పైగా సమస్యలకు సంబంధించి తొలి దశలో  11 అంశాల సమస్యల పరిష్కారానికి స్టార్ట్‌ఆప్స్‌కు అప్పగిస్తారు.

బ్రోకెన్‌ రైల్‌ డిటెక్షన్‌ సిస్టం, రైల్‌ స్ట్రేస్‌ పర్యవేక్షణ సిస్టం,సబర్బన్‌ విభాగంలో వ్యవస్థ అభివృద్ధి పరచడం కోసం ఇండియన్‌ రైల్వేస్‌ నేషనల్‌ ఏటీపీ వ్యవస్థతో అనుసంధానం, ట్రాక్‌ తనిఖీల కార్యకలాపాలలో అటోమేటిక్‌ వ్యవస్థ, భారీ సరుకు రవాణా వ్యాగన్ల కోసం నాణ్యమైన వ్యవస్థ, 3`ఫేజ్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ట్రాక్షన్‌ మోటర్స్‌ స్థితిగతుల పర్యవేక్షణకు అన్‌లైన్‌ వ్యవస్థ, ఉప్పు వంటి సరుకుల రవాణా కోసం తేలిక

పాటి వ్యాగన్ల ఏర్పాటు, ప్రయాణికుల సేవల అభివృద్ధి కోసం డిజిటల్‌ డేటా ఉపయోగించడం ద్వారా అన్‌లైటికల్‌ వ్యవస్థ అభివృద్ధి, ట్రాక్‌ క్లీనింగ్‌ యంత్రాగం, స్వంతంగా రిఫ్రెష్‌ కోసం యాప్, వంతెనల తనిఖీ కోసం రిమోట్‌ సెన్సింగ్‌, జియోమెట్రిక్‌ మరియు జీఐఎస్‌ వినియోగం వంటి సమస్యలు, అంశాలను తొలి దశలో పరిష్కరిస్తారు.

ఆవిష్కర్తలకు సమానభాగస్వామ్యం

ఆవిష్కర్తలకు సమాన భాగస్వామ్యం పద్థతిలో రూ. 1.5 కోట్ల వరకు గ్రాంట్‌. రైల్వేలో ప్రోటోటైప్‌లో ట్రయల్స్‌ నిర్వహిస్తారు. ప్రోటోటైప్‌ల విజయవంతం తర్వాత పనితీరును బట్టి మరింత నిధులు అందించబడుతాయి. ఆవిష్కరణల ఎంపిక పారదర్శకంగా మరియు సరైన విధానంలో రైల్వే మంత్రిత్వ శాఖ వారిచే ఆన్‌లైప్‌ పోర్టల్‌ నిర్వహించబడుతుంది.

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles