Friday, March 29, 2024

ఇటలీలో బర్త్ డే కేక్ కట్ చేసిన ప్రభాస్‌

మిలాన్‌: ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఉన్న ‘బాహుబలి’ అక్కడే చిత్ర బృందంతో కలిసి తన పుట్టిన రోజు వేడుక జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సెట్స్ లోనే కేక్ కట్ చేసి సందడి చేశారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ‘డార్లింగ్‌’కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి సర్‌ప్రైజ్‌ చేస్తూ ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందం తొలి‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

prabhas celebrates his birthday at Italy

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా పూజా హెగ్డే సందడి చేయనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

prabhas celebrates his birthday at Italy

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles