Saturday, April 20, 2024

దానిమ్మ పళ్ళు

 (‘POMEGRANATES’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు సేత: డా. సి.బి. చంద్ర మోహన్

                     34. సంచారి తత్త్వాలు

                     ————————

       పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పళ్ళ తోటలో చాలా దానిమ్మ చెట్లు ఉండేవి. శరత్కాలాల్లో, తోటలోని దానిమ్మ పళ్ళు తన ఇంటి బయట వెండి పళ్లాలలో పెట్టి ఉంచేవాడు. ఆ వెండి పళ్లాల మీద తన స్వహస్తాలతో  ఇలా వ్రాసి సంతకం చేసేవాడు. ” తప్పక ఒక పండు తీసుకోండి. ఇదే మీకు ఆహ్వానం.”

      ప్రజలు అటు వైపుగా వెళ్లే వారు గానీ, ఎవ్వరూ పళ్ళు తీసుకోలేదు.

       ఆ వ్యక్తి ఆలోచించాడు. ఒక  శరత్కాలంలో ఇంటి బయట  వెండి పళ్లాలలో దానిమ్మ పళ్ళు పెట్ట లేదు. కానీ, పెద్ద అక్షరాలతో , తన సంతకంతో ఒక లేఖ వ్రాసి పెట్టాడు. దానిలో ఇలా ఉంది. ” మా వద్ద ఈ పొలాల్లో పండిన వాటిలో కెల్లా శ్రేష్ఠ మైన దానిమ్మ పళ్ళు ఉన్నాయి. వాటిని మామూలు దానిమ్మ పళ్ళ కన్నా ఎక్కువ వెండి నాణాలకు అమ్ముతాం.”

      ఇక చూడండి! ఆడా, మగా — అందరూ దానిమ్మ పళ్ళు కొంటానికి పోటీ పడ్డారు.

Also read: శాపం

Also read: ఆనందము — దుఃఖము

Also read: హింస నచణ —- ( ఒక) ధ్వంస రచన

Also read: కీచకుడు లేని “విరాట పర్వం”

Also read: ఎలుకా, పిల్లీ

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles