Friday, March 29, 2024

నీకు దగ్గరగా

అక్కడ నీవు ఇక్కడ నేనైనా

ఎప్పుడు నీవు నాకు దగ్గరే

నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నీ శరీర సహజ సుగంధం,

నన్ను వెచ్చగా తాకుతూ నీ ఊపిరి,

చేరువగా,  మరింత చేరువగ

మెత్తగా హత్తుకొంటున్న నీ సుకుమార  స్పర్శ ,

నా  ఆత్మను  పలకరిస్తున్న  నీ  ఆత్మ ,

అతి సమీపంలో జంకుతూ  వణకుతూ ముందుకు

చేరువవుతున్న నీ  రెండు తీయని  అధరాలు …

నా నడత నాకే తెలియని  విచిత్రం ,

అదేమిటో,  అదెలాగో తెలియదు కానీ

ఎండమావిలో నీరు తాగుతాను,

సుదూర విహారి నిండు చందమామ ను

ముద్దాడతాను,  నా రోజులు ఎలా గడుస్తున్నాయో

మరచిపోతాను…నీ తీయని ఆలోచన ల వెచ్చదనంలో.

ఇది కల్పితకల్పన గా అనిపిస్తుంది

…  నా నిజం,  ప్రేమ తర్కానికి అందదు మరి

నా హృదయం కాలాన్ని దూరాన్ని లెక్క చేయదు

ఏమో నేను పిచ్చి వాడినేమో?

ఏం నేనొక్కడినే నా ఇలా… ఉంటారు వేలకొలది స్వప్న జీవులు

అయినా ఎవరు  చెప్పలేరు ఈ వ్యసనపు ఆనుపానులు.

Also read: నిశ్శబ్ద గీతిక

Also read: కర్మ ఫలం

Also read: జ్ఞాపకాలు

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles