Friday, March 29, 2024

కవితోత్సవం

కవిత

భావానికి సుందర రూపం

కొంతలో ఎంతో నింపుకుని

అందమైన ఊహలకు

మెరుగులు దిద్దే భాషతో

మది ఆహ్లాద పరిచేది

ఉల్లాసంతో మనసు చిందులు వేయించేది

ఆలోచనలను గిలకొట్టేది

సందేశం అందించేది

బతుకు దీపం వెలిగించేది

లాక్షణిక సూత్రాలకు లొంగనిది

ఛందోబంధాలకు  కట్టుబడనిది

పడికట్టు పద విన్యాసాలకు

అతీతమైనది

భావోద్వేగాలను అందంగా వెలువరించేది

ఆనందోబ్రహ్మని తలపింపజేసేది

సృజనలో అంతర్మధన  సంకటం

పూర్తవగానే ప్రసవం జరిగినంత హాయి

మనో కాయాల క్లేశ విముక్తి

సువిమర్శతో భావప్రాప్తి.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles