Saturday, September 30, 2023

అడ్వాణీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

న్యూదిల్లీ: మాజీ ఉపప్రధాని ఎల్​కే అడ్వాణీ 93వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు ఆయన నివాసానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెళ్లారు. అడ్వాణీతో ఆత్మీయంగా ముచ్చటించిన ఇరువురు నేతలు.. కేక్‌ కట్‌ చేయించారు. మోదీ, షాలతో పాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అడ్వాణీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఎల్‌కే అడ్వాణీ 1927 నవంబరు 8న కరాచీలో జన్మించారు. భారత్‌ విభజన తర్వాత అడ్వాణీ కుటుంబం భారత్‌లో స్థిరపడింది. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీతోపాటు ఈయన కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆయనే. జాతీయ రాజకీయాల్లో పార్టీ ఎదుగుదలకు అడ్వాణీ చాలా కృషి చేశారు. అటల్ బిహారీ వాజపేయి 1998 నుంచి 2004 వరకూ ప్రధానిగా ఉన్నప్పుడు అడ్వాణీ ఉపప్రధానిగా, దేశీయాంగమంత్రిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles