Friday, June 21, 2024

‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్

• జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం…

• ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం… టీఆర్ఎస్ కు 68-78 స్థానాలు, బీజేపీకి 25- 35 స్థానాలు, ఎంఐఎం కు 38-42 స్థానాలు, కాంగ్రెస్ కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతం.

• టీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

• పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశముంది.

• ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కన్పిస్తోంది. సైలెంట్ వేవ్ పని చేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశముంది.

• ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 38 శాతం, బీజేపీకి 32 శాతం, ఎంఐఎం 13 శాతం, కాంగ్రెస్ కు 12 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతం.

• అనేక మున్సిపల్ డివిజన్లలో బహుముఖ పోటీ ఉండటం, పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఆఖరి ఓటు లెక్కించే వరకు గెలుపోటముల విషయంలో ఉత్కంఠ నెలకొనే అవకాశముంది.

• ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగం, వరద బాధితులకు సహాయం వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి.

• ఈ ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు 28 శాతం, నిరుద్యోగుల సమస్య 21 శాతం, వరద బాధితులకు సాయం 16 శాతం, ట్రాఫిక్ రద్దీ సమస్య 12 శాతం, రోడ్ల సమస్య 10 శాతం, పరిశుభ్రత 9 శాతం మంది, ఇతర అంశాలు 5 శాతం ప్రభావితం చూపుతున్నాయి.

• ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోగలిగింది.

• బీజేపీ 2016 ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తుతో 4 వార్డులు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సీట్ల సంఖ్యను 6 రెట్లు పెంచుకోవడం గమనించదగ్గ విషయం.

• సైలెంట్ ఓటు పనిచేస్తే బీజేపీ అనూహ్యంగా 40 అంతకు మించి సీట్లకు చేరుకునే అవకాశం ఉంది.

• ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొంత పోటీ ఇవ్వగలిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది.

• ఇతర పార్టీలతో పోలిస్తే ఎంఐఎం స్ట్రయిక్ రేట్ చాలా బాగుంది. మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో 51 వార్డుల్లో మాత్రమే పోటీ చేసినప్పటికీ దాదాపు 42 వార్డుల్లో గెలుపొందే అవకాశముంది.

• తెలుగుదేశం, వామపక్షాలు ఈ ఎన్నికల్లో పోటీ నామమాత్రమే. చాలా చోట్ల ఆయా పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయే అవకాశముంది.

• సిట్టింగ్ కార్పొరేటర్లపై అసంతృప్తి టీఆర్ఎస్ ను దెబ్బతీస్తోంది.

• వరద సాయంలో జరిగిన అక్రమాలు టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను గండికొట్టాయి.

• మజ్లిస్ తక్కువ సీట్లలో పోటీ చేయడంవల్ల టీఆర్ఎస్ కు కలిసొచ్చింది. ముఖ్యంగా ఎంఐఎం పోటీ చేయని వార్డుల్లో ముస్లింలు 80 శాతం మంది టీఆర్ఎస్ కు మద్దతిచ్చారు.

• రాజకీయ విశ్లేషకులు అనుకున్నంత, బీజేపీ ఆశించినంత మేరకు హిందువుల ఓట్లు గంప గుత్తగా బీజేపీవైపు మొగ్గు చూపలేదు.

• కాంగ్రెస్, ఇతర పార్టీలు చీల్చిన ఓట్ల కారణంగా టీఆర్ఎస్ అనేక వార్డుల్లో లబ్ది చేకూరుంది.

• ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉంది. అభ్యర్థుల గెలుపోటములను ఈ అంశాలు ప్రభావితం చేశాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles