Wednesday, September 27, 2023

బీజేపీ ఆహ్వానం మేరకే హస్తిన యాత్ర: పవన్

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఆహ్వానం మేరకు ఢిల్లీ వచ్చిన తాము   ఏపీకి చెందిన అనేక అంశాలపై చర్చించామని జనసేన అధినేత  పపన్ కల్యాణ్ చెప్పారు. తమ భేటీలో  అమరావతి, పోలవరం,  తిరుపతి లోక్ సభ స్థానం  ఉప  ఎన్నిక సహా అనేక అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. నడ్డాతో భేటీ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.  చివరి రైతుకు న్యాయం జరిగేంతవరకు  జనసేన అండగా ఉంటుందని చెప్పారు.  

ఇరు పార్టీలు కలసి  రాష్ట్రంలో ఎలా  అధికారంలోకి రావాలన్న అంశంపై చర్చించామన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఏ పార్టీ పోటీ చేయాలనే అంశాన్ని చర్చించేందుకు కమిటీ ఏర్పాటవుతుందని కమిటీలో చర్చించిన  మీదట ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.  దీనిపై రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతిభద్రతల సమస్య, దేవాలయాలపై దాడులు గురించి చర్చించనిట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

బీజేపీ నేతల  ఆహ్వానం మేరకే రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చాం తప్ప తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక కారణం  కాదని  జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని,ఎన్నికల కోసమే అయితే ఇంత దూరం రానవసరం లేదని చెప్పారు. అమరావతే రాష్ట్ర రాధానిగా ఉండాలన్నదన్నది  తమ పార్టీ నిర్ణయంటూ ప్రభుత్వ మారినప్పుడల్లా రాజధానిని మార్చలేం కదా? అని అన్నారు. బీజేపీ నేతలు కూడా అదే స్పష్టం చేశారన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles