Friday, December 9, 2022

శాపం

(‘THE CURSE’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం:డా సి. బి. చంద్ర మోహన్

                            33. సంచారి తత్త్వాలు

                            ————–

       సముద్రం దగ్గర నివసించే ఒక వృధ్ధుడు ఒక సారి నాతో ఇలా అన్నాడు. ” ఇప్పటికి ముఫ్పయి ఏళ్ల క్రితం ఒక నావికుడు నా కూతురుతో పారిపోయాడు. నేను వారిద్దరినీ నా మనసులో శపించాను. ప్రపంచం మొత్తం లోనే నా కూతురుని ఎక్కువగా ప్రేమించాను.”

       “దానికి కొద్ది రోజుల తరువాత ఆ యువ నావికుడు, తన ఓడతో సహా సముద్ర గర్భంలో కలిసిపోయాడు. అతనితో పాటు నా ప్రియమైన కూతురు కూడా నాక్కాకుండా పోయింది.”

      ” ఇప్పుడు నాలో యువతీ యువకులను చంపిన ఒక హంతకుడిని చూస్తున్నావు. నా శాపమే వారిని నాశనం చేసింది. కాటికి కాళ్ళు చాపుకున్న ఈ సమయంలో నేను  దైవాన్ని క్షమించమని కోరుకుంటున్నాను. ”

       ఇదీ ఆ ముసలాయన చెప్పింది. కానీ నాకతని మాటల్లో ఒక బడాయి కనిపించింది. అతడు, తన శాపానికి ఉన్న శక్తి గురించి, ఇంకా గర్వ పడుతున్నట్లు అనిపించాడు.

Also read: ఆనందము — దుఃఖము

Also read: హింస నచణ —- ( ఒక) ధ్వంస రచన

Also read: కీచకుడు లేని “విరాట పర్వం”

Also read: ఎలుకా, పిల్లీ

Also read: రూత్ దొరసాని

                      

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles