Wednesday, April 24, 2024

ఎన్ఎస్సీఎస్ ద్వారా పెగాసస్ కు వందల కోట్లు చెల్లింపు: ప్రశాంత్ భూషణ్

దిల్లీ: నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ బడ్జెట్ ను పది రెట్లు పెంచివేశారనీ, పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ కోసం దీన్ని ఖర్చు చేశారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ప్రశాంత్ భూషణ్ శుక్రవారంనాడు ఇచ్చిన ట్వీట్ లో 2016-17లొ ఈ సంస్థకు కేటాయింపులు రూ. 33.17 కోట్లు ఉంటే దానిని 2017-18లోరూ. 333.58కోట్లకు పెంచివేశారని చెప్పారు. అదే సంవత్సరం ఇజ్రేల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారు చేసిన పెగాసస్ నిఘా వ్యవస్థ కోసం వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని సినియర్ అడ్వకేట్ అన్నారు. ఇదే ఆరోపణ ప్రముఖ బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి రెండు రోజుల కిందట చేశారు.

‘‘2016-17లో ఎన్ఎస్ఓ బడ్జెట్ రూ. 33.17 కోట్లు. మరుసటి సంవత్సరం అంటే 2017-18లో బడ్జెట్ ను రూ. 333కోట్లకు (అంటే పది రెట్టు) పెంచివేశారు. సైబర్ సెక్యూరిటీ ఆర్ అండ్ డి అనే విభాగం కోసం రూ. 300 కోట్లు అదనంగా కలిపారు. ఈ సంవత్సరంలొనే ఎన్ఎస్ఓ కు ప్రతిపక్ష నాయకుల, న్యాయమూర్తుల, అధికారుల, జర్నలిస్టుల ఫోన్లు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను వినియోగించి ట్యాప్ చేసినందుకు వందల కోట్ల రూపాయలు చెల్లించారు.

అయితే, మే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్ఎస్ఓ పదమూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. 2017-18 నాటి బడ్జెట్ స్థాయికి 13 రెట్టు అధికంగా ఖర్చు జరిగింది. సుమారు రూ.800 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు ప్రత్యర్థులపైన నిఘా కోసం ఖర్చు చేశారు. నిజానికి 2016-17లో రూ. 33.17 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దాన్ని రూ. 81.03కోట్లకు హెచ్చించారు. కానీ ఆ సంవత్సరం వాస్తవంగా ఖర్చు చేసింది మాత్రం రూ. 39.09 కోట్లు మాత్రమే.  2017-18లో కేటాయింపులు విపరీతంగా పెరిగాయి. రూ. 333.58 కోట్లకు పెంచివేశారు. సవరించిన అంచనాలను రూ. 168 కోట్ల దగ్గర ఉంచారు. వాస్తవంగా ఆ సంవత్సరం ఖర్చు చేసింది రూ. 61.18 కోట్లు.

కేవలం 2018-19లోనే ఎన్ఎస్ఓ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ‘పరిపాలనా వ్యయం’ పేరు మీద ఆ సంవత్సరం కేటాయింపులను రూ. 303.83 కోట్లకు పెంచారు. సవరించిన అంచనాలలో కేటాయింపులను రూ. 841.73 కోట్లకు పెంచివేశారు. అసలు బడ్జెట్ కేటాయింపును రూ. 125.84 కోట్లుగా చూపించినప్పటికీ పెట్టుబడి వ్యయం (కేపిటల్ ఎక్స్ పెండిచర్) కింద రూ. 715.89 కోట్లు చూపించారు. ఈ డబ్బంతా పెగాసస్ సాఫ్ట్ వేర్ కోసం ఖర్చు చేసినట్టు అర్థం అవుతోంది.

Also read: భయంగొలుపుతున్న పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles