Wednesday, April 24, 2024

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయించింది. తాజాగా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దయ్యింది. పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న తరుణంలో కోటా మొత్తం రద్దు చేయడం గమనార్హం.  లోక్‌సభలోనూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగింది. కోటాను ఎత్తి వేయాలని కొందరు.. పెంచాలని మరికొందరు కోరారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్రం ఆ సమయంలో ప్రకటించింది. ఈ విషయమై స్పీకర్‌ ఓం బిర్లా సైతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదేశించారు. పది సీట్ల కోటా సరిపోదని.. దాన్ని పెంచాలని.. లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి డిమాండ్‌ చేశారు. అయితే, ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో ఉందని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles