Tuesday, March 28, 2023

రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎంపి అడ్డానా?!

వోలేటి దివాకర్

ఎంపి మార్గాని భరత్ రామ్ తన మనసులోని మాటను పైకే చెప్పేశారా?. రాజమహేంద్రవరం గడ్డ నా అడ్డా అంటూ పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పినా ఎంపి మార్గాని భరత్ రామ్ వచ్చే ఎన్నికల నాటికి రాజమహేంద్రవరం అసెంబ్లీ స్థానాన్ని తన అడ్డాగా మార్చుకునేందుకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. బుధవారం గ్రేటర్ రాజమహేంద్రవరం వైసిపి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోరంపూడిలోని ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైతే తన ఆస్తులను కూడా అమ్మేస్తానని ప్రకటించడం గమనార్హం.

Also read: 13 ఏళ్ల తర్వాత రాజమహేద్రవరం పోలీసు అర్బన్ జిల్లాకు కొత్త స్వరూపం

వైసిపికి స్థానికంగా కోఆర్డినేటర్ లేకపోవడంతో ఈ సమావేశాన్ని భరత్ రామ్ అంతా తానై ప్లీనరీ ని నడిపించారు. ఈ సమావేశంలో భరత్ రాజమహేద్రవరం అభివృద్ధికి తాను చేసిన కృషిని ఏకరువు పెట్టారు. గోదావరి నది ప్రక్షాళనకు మిషన్ గోదావరి ప్రాజెక్టు కింద తొలి దశలో రూ. 89 కోట్లు మంజూరు చేయించానని, రాజమహేంద్రవరంనకు రింగ్ రోడ్డు వేయిస్తానని ఎంపి తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్కు ఒక నెలలోగా శంఖుస్థాపన చేయిస్తామన్నారు. మోరంపూడి ఫ్లైఓవరు నిర్మించేందుకు అవసరమైతే తన ఆస్తులు అమ్ముతానన్నారు.  రాజమహేంద్రవరం అభివృద్ధికి రూ. 125 కోట్లు మంజూరు చేయించినట్లు ఎంపి వెల్లడించారు. హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తీర్మానించారు. అయితే కీలకమైన కోఆర్డినేటర్ గురించి ప్లీనరీలో చర్చించలేదు.

Also read: గోరంట్ల మాట్లాడేది ఎవరి గురించి?!

అందరూ కలిసి వస్తారా?

 ప్లీనరీ సమావేశానికి మాజీ కోఆర్డినేటర్లు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం . రౌతు సూర్యప్రకాశరావు నగరంలో లేరని సమాచారం. మరో మాజీ కోఆర్డినేటర్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం సమావేశానికి డుమ్మా కొట్టారు. యువనేత జక్కంపూడి గణేష్, ఆయన తల్లి కూడా ఈ సమావేశానికి రాలేదు. మొన్నటి వరకు పార్టీలో ప్రత్యర్థులుగా ఉన్న ఎంపి మార్గాని భరత్లామ్, వైసిపి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రస్తుతానికి చేతులు కలిపారు.

Also read: కార్పొరేషన్ ఎన్నికలపై వైసీపీ సర్వే….సరే అంటేనే టిక్కెట్లు!

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసిపిని అధికారంలోకి తెచ్చేందుకు రాజా, రూరల్ కోఆర్డినేటర్ చందన రమేష్, తాను సమిష్టిగా కృషి చేస్తామని ఎంపి వెల్లడించారు. అయితే రాజమహేంద్రవరంలో భారీ అనుచరగణం ఉన్న జక్కంపూడి రాజ కుటుంబం నగరంలో ఎంపి పెత్తనానికి ఒప్పుకుంటుందా, అసెంబ్లీ ఎన్నికల వరకు వీరి సమైక్యత నిలిచి ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.

Also read: రాజమహేద్రవరం టీడీపీ అభ్యర్థి అదిరెడ్డి వాసునట! మరి గోరంట్ల పరిస్థితి ఏంటి?

ఆదిరెడ్డి వాసుకు సీటే రాదట

తన రాజకీయ గురువు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వదిలేసి మాజీ ఎమ్మెల్సీ , టిడిపి నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడిపై ఎంపి భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఎమ్మెల్సీ పదవి పొంది టిడిపిలోకి ఫిరాయించిన అప్పారావును వెన్నుపోటుదారుడిగా … అప్పాబావ రాజకీయాలు చేసే వ్యక్తిగా అభివర్ణించారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దివంగత మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీకి టిక్కెట్టు ఇచ్చారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు ఆశిస్తున్న ఆదిరెడ్డి వాసుకు సీటు ఇవ్వరని భరత్ జోస్యం చెప్పారు. గోరంట్ల రాజమహేద్రవరం సీటును ఆశిస్తున్న ప్రచారం ఇక్కడ ప్రస్తావనర్హం.

Also read: పదవులు వద్దన్న ఉండవల్లి!

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles